ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-06-23T11:05:16+05:30 IST

గుండ్లకమ్మ పరీవాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ..

ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు

ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి హెచ్చరిక 

నందిపాడులోని డంపింగ్‌ యార్డు సందర్శన 


మద్దిపాడు, జూన్‌ 22 : గుండ్లకమ్మ పరీవాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేవారు. సోమవారం ఆయన నందిపాడు డంపింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అధికార పార్టీ నాయకులు ఇసుకను దోచుకుంటున్నారంటూ ఆంధ్రజ్యోతిలో ‘తవ్వుకో.. అమ్ముకో’ శీర్షికన సోమవారం కథనం ప్రచురతమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన కలెక్టర్‌ తక్షణ చర్యలకు ఆదేశించడంతో ఆర్డీవో నందిపాడు వెళ్లారు.


అక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అనుమతి లేని ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్‌  బాబ్జి, మైనింగ్‌ అధికారులు, వీఆర్వోలు ఉన్నారు. అనంతరం మద్దిపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోలు,  సిబ్బందితో సమావేశమయ్యారు. సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న వారికి 72 గంటల్లో రేషన్‌ కార్డు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. పెండింగ్‌ దరఖాస్తులు వెంటనే అప్‌లోడ్‌ చేయకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 

Updated Date - 2020-06-23T11:05:16+05:30 IST