రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

ABN , First Publish Date - 2020-11-07T08:36:36+05:30 IST

కావలి పట్టణ పరిధిలోని మద్దూరుపాడు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

 భార్యకు తీవ్రగాయాలు


కావలి రూరల్‌, నవంబరు 6 : కావలి పట్టణ పరిధిలోని మద్దూరుపాడు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా గు డ్లూరు మండలం చేవూరుకు చెం దిన చౌడేటి సుబ్రహ్మణ్యం, ఆయన భార్య జయమ్మతో కలసి సొంత పనుల నిమిత్తం టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనంపై కావలికి బయలుదేరారు. మార్గమధ్యంలో మద్దూరుపాడు సమీపంలోకి వచ్చేసరికి అదే మార్గంలో వెనుక వైపు వేగంగా వస్తున్న బొలేరో వాహనం మోటారు సైకిల్‌ను ఢీకొట్టి అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రాక్టర్‌నూ ఢీకొట్టడంతో ట్రక్కు ఫల్టీకొట్టింది.


ఈ ప్రమాదంలో మోటారు సైకిల్‌పై వస్తున్న సుబ్రహ్మ ణ్యం (55) అక్కడికక్కడే మృతి చెందగా, భార్య జయమ్మ తీవ్రంగా గాయపడింది. ఆమెను చికి త్స నిమిత్తం 108 వాహనంలో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించి ఎస్‌ఐ ప్రతాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఒక కుమార్తె ఉంది.

Updated Date - 2020-11-07T08:36:36+05:30 IST