రోడ్డు ప్రమాదంలో ఎన్‌జీవో మాజీ అధ్యక్షుడి మృతి

ABN , First Publish Date - 2020-10-31T09:21:09+05:30 IST

బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంలో వస్తున్న విశ్రాంత ఉద్యోగి, ఎన్‌జీవో సంఘం మాజీ అధ్యక్షుడు చిన్న గాలిరెడ్డి(66)ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది.

రోడ్డు ప్రమాదంలో ఎన్‌జీవో మాజీ అధ్యక్షుడి మృతి

కంభం, అక్టోబరు 30 : బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంలో వస్తున్న విశ్రాంత ఉద్యోగి, ఎన్‌జీవో సంఘం మాజీ అధ్యక్షుడు చిన్న గాలిరెడ్డి(66)ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన అర్థవీడు మం డలం నాగులవరం గ్రామ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... కంభానికి చెందిన విశ్రాంత ఉద్యోగి గాలిరెడ్డి శుక్రవారం అర్థవీడు మండలం మొహిద్దీన్‌పురానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి కొడుకు, కోడలు, కుమార్తెతో మాట్లాడి రాత్రికి తిరిగి కంభం వస్తున్నాడు. ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఆయన్ను ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్లు తెలిసింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Read more