రైతుకు ‘భరోసా’

ABN , First Publish Date - 2020-10-28T09:49:14+05:30 IST

రైతులకు అన్ని సేవలను ఒకే కేంద్రంగా అందించడానికి ప్రభుత్వం ఏ ర్పాటుచేసిన రైతుభరోసా కేంద్రాలు సత్ఫలితాలు అం దిస్తున్నాయి.

రైతుకు ‘భరోసా’

 సత్ఫలితాలిస్తున్న కేంద్రాలు

 భూసార పరీక్షల మొదలు 

 ఉత్పత్తుల అమ్మకం వరకూ..  


ఒంగోలు(జడ్పీ), అక్టోబరు 27: రైతులకు  అన్ని సేవలను ఒకే కేంద్రంగా అందించడానికి ప్రభుత్వం ఏ ర్పాటుచేసిన రైతుభరోసా కేంద్రాలు సత్ఫలితాలు అం దిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 879 కేంద్రాలు రైతుల కు వివిధ రకాలుగా తోడ్పడుతున్నాయి.  గతంలో రై తులు వారికి ఎలాంటి సమాచారం కావాలన్నా మండ ల వ్యవసాయ కేంద్రానికి కాని, జిల్లా  కేంద్రానికి కాని వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి  ఉండటంలేదు. రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ సహాయకులు  నిత్యం అందుబాటులో ఉంటూ రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వివిధ పథకాల తీరుతె న్నులను వివరిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా దళారీ వ్యవస్థను రూపుమాపి ప్రభుత్వానికి , రైతుకు మధ్య మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూడాల న్నదే ప్రభుత్వ అభిమతం. దానికి అ నుగుణంగానే వాటి పనితీరు కూడా ఆశాజనకంగా ఉంటోంది.  కొన్నిచోట్ల సిబ్బంది అందు బాటులో ఉండడం లేదనే ఆరోపణలు, గ్రామాలు కేంద్రంగా ఇవి ఉండడంతో మితిమీరిన రాజకీయ జోక్యం పట్ల  విమర్శలు వస్తున్నప్పటికీ ఎక్కువ శాతం ఇవి విజయవంతంగానే నడుస్తున్నాయి.


భరోసా కేంద్రాల్లో ఎరువుల పంపిణీ

రైతులకు కావలసిన ఎరువులు అందించడానికి రైతుభరోసా కేంద్రాల్లో కియోస్క్‌లు ఏర్పాటు చేసి వాటి ద్వారా బుక్‌ చేసుకున్న తరువాతే ఎరువులు అందిస్తున్నారు. దీని వల్ల ఖరీఫ్‌లో ఎరువుల పంపిణీ సజావుగా జరిగింది. తాజాగా అందిస్తున్న విత్తనాలు సైతం ఈ కేంద్రాల ద్వారానే పంపిణీ చేయాలని అధి కారులు నిర్ణయించారు. ఈవిధానం మొత్తం ఆన్‌లైన్‌ లో నమోదు అవుతుండడం వల్ల ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు అంచనా వేసుకుని ముందస్తు ప్రణాళికలు రచించుకోవడానికి వీలుంటుంది.


అందుబాటులో వ్యవసాయ పనిముట్లు

రైతులకు రాయితీపై అందించే పనిముట్లను కూడా రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంచను న్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులు నామమాత్రపు అద్దె చెల్లించి వాడుకోవడానికి వీలుంటుంది. రబీ సీ జన్‌లోనే వీటిని ఆయా కేంద్రాలకు చేర్చడానికి అధి కారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం అందిస్తున్న గిట్టుబా టు ధరతో పాటు  బహిరంగ మార్కెట్‌లో వాటి ధరల వివరాలను సైతం భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంచుతున్నారు. 


తాజాగా,  ప్రభుత్వం మద్దతు ధరకు కొనే పంట లను ఈ కేంద్రాల పరిధిలోనే జరపనున్నారు. ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ -కర్షక్‌ నమోదు కా ర్యక్రమం కూడా రైతుభరోసా కేంద్రాల ద్వారా ము మ్మరంగా సాగుతోంది. రైతు తన పంటకు సంబం ఽధిం చి  ఎలాంటి సేవలు అందుకోవాలన్నా ఈ-కర్షక్‌లో న మోదు చేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.


లోపాలు సరిదిద్దుకోవాలి

జిల్లాలో కొన్ని రైతుభరోసా కేంద్రాల వద్ద వ్యవ సాయ సహాయకులు అందుబాటులో ఉండడం లేదని రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటి నిర్వహణ లో రాజకీయం జోక్యం తగ్గించి పూర్తి పారదర్శకంగా సేవలు అందేవిధంగా వీటిని తీర్చిదిద్దితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతో పాటు రైతు సేవాకేంద్రాలుగా ఇవి భాసిల్లే అవకాశం ఉంది. 

Updated Date - 2020-10-28T09:49:14+05:30 IST