శ్రీనివాస కల్యాణ మండపం ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-27T07:11:32+05:30 IST

పట్టణంలోని శ్రీలక్ష్మీ ప ద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీనివాస కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు ప్రారంభించారు.

శ్రీనివాస కల్యాణ మండపం ప్రారంభం

మార్కాపురం (వన్‌టౌన్‌), అక్టోబరు 26 : పట్టణంలోని శ్రీలక్ష్మీ ప ద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీనివాస కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు ప్రారంభించారు. వేద పండితులు ఏవీకే కృష్ణమాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర నాయకుడు పెరుమాళ్ల కాశీరావు, ఏ ఎంసీ చైర్మన్‌ గుంటక కృష్ణవేణి సుబ్బారెడ్డి, వైస్‌చైర్మన్‌ బొగ్గరపు శేషగిరిరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి కాశీనాథ్‌, టీడీపీ జిల్లా అధికారప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, చెన్నకేశవస్వామి ఆలయ ట్రస్ట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ యక్కలి కాశీ విశ్వనాథ్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-27T07:11:32+05:30 IST