రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-27T07:09:58+05:30 IST

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దర్శి నియోజకవర్గ వైసీపీ నాయకుడు మద్దిశెట్టి శ్రీధర్‌ పేర్కొన్నారు. మండలంలోని లంకోజనపల్లిలో ఆయన ఆదివారం సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

దర్శి, అక్టోబరు 26 : రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దర్శి నియోజకవర్గ వైసీపీ నాయకుడు మద్దిశెట్టి శ్రీధర్‌ పేర్కొన్నారు. మండలంలోని లంకోజనపల్లిలో ఆయన ఆదివారం సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు. కార్యక్రమంలో దర్శి, తూర్పువెంకటాపురం చైర్‌పర్సన్లు చెన్నారెడ్డి, ఎం.పుల్లారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మెన్‌ కేవీ.రెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, వైసీపీ నాయకులు కే.అంజిరెడ్డి,  ఎస్‌.తిరుపతిరెడ్డి, వైవీ సుబ్బయ్య, రవిచంద్రారెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, గోపు యర్రయ్య, కోటయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T07:09:58+05:30 IST