డివైడర్‌ను ఢీకొన్న కారు

ABN , First Publish Date - 2020-10-27T07:08:56+05:30 IST

డివైడర్‌ను ఢీకొన్న కారు

డివైడర్‌ను ఢీకొన్న కారు

 10 మందికి గాయాలు

 సాయం అందించిన ఎమ్మెల్యే


కంభం, అక్టోబరు 26 : కంభం చెరువు నుంచి పట్టణంలోకి వేగంగా వస్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీ కొంది. దీంతో కారులో ఉన్న 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. కంభం పోలీసుల కథనం మేరకు కందులాపురం పంచాయతీ పరిధిలో ప్రభుత్వ వైద్యశాల సమీపంలో నివసిస్తున్న రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి వెంకటరమణ తన కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఇన్నోవా కారులో కంభం చెరువును చూసేందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా చీకటి పడింది. దీంతో హైవేపై వస్తుండగా రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు మధ్యలో కొత్తగా నిర్మించిన డివైడర్‌ను కారు బలంగా ఢీ కొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో వాహనంలోని వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో గిద్దలూరు నుంచి మార్కాపురం వెళుతున్న ఎమ్మెల్యే రాంబాబు ఘటనను చూసి బోల్తా పడ్డ కారు వద్దకు వచ్చారు.


కారులో ఉన్న 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే  108, పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు తన సెక్యూరిటీ సిబ్బందితో సహాయం చేయించి తాను కూడా వైద్యశాలకు వెళ్లారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పడమే కాక సకాలంలో వైద్యం అందేలా చేసి మెరుగైన వైద్యం అవసరమని చెప్పగా తానే వాహనాన్ని ఏర్పాటు చేసి ఒంగోలుకు పంపించాడు. వైద్యశాల ఖర్చుల కోసం రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. దీనితో ఎమ్మెల్యే ఔదార్యాన్ని పలువురు కొనియాడారు.

Updated Date - 2020-10-27T07:08:56+05:30 IST