పత్తి తూకంలో మాయాజాలం

ABN , First Publish Date - 2020-10-27T07:07:43+05:30 IST

పత్తి తూకంలో మాయాజాలం

పత్తి తూకంలో మాయాజాలం

రాచర్ల, అక్టోబరు 26 : పత్తి రైతులు తమ పత్తిని అమ్ముకునే క్రమంలో దొంగ కాటాలతో తీవ్రంగా నష్టపోయిన ఘటన గంగంపల్లె గ్రామంలో బయటపడింది. కాలువపల్లి పంచాయతీ పరిధిలోని కాలువపల్లి, గంగంపల్లె గ్రామాలలో మకాం వేసిన కొమరోలు మండలం పోసుపల్లి గ్రామానికి చెందిన పి.వెంకటయ్య అనే వ్యాపారి వద్ద కాటా తీసుకుని గంగంపల్లె గ్రామంలో గత వారం రోజులుగా పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ళ మేర పత్తి రాగా ఆ పత్తిని వ్యాపారి అయిన వెంకటయ్య వద్ద కాటా వేయగా 15 క్వింటాళ్ళు రావలసిన పత్తి కేవలం 6 నుంచి 7 క్వింటాళ్ళు మాత్రమే వస్తోంది. దీంతో గ్రామస్థులకు అనుమానం వచ్చి అతను తెచ్చిన లారీని పత్తితో వే బ్రిడ్జికి తీసుకెళ్లారు.


  అక్కడ సగానికి సగం తక్కువ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో గ్రామంలోని రైతులంతా ఒక్కటయ్యారు. దీంతో వ్యాపారి వెంకటయ్య అక్కడి నుంచి జారుకున్నాడు. దీనితో రైతులంతా కలిసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం ఉదయం గ్రామంలో విచారణ చేపట్టారు. కాటాను పరిశీలించారు. మోసం ఏ విధంగా జరిగింది, రైతులు ఎంతమంది వెంకటయ్యకు పత్తి అమ్మారు. అనే విషయాన్ని పరిశీలించారు. రైతులను మోసం చేసే ఇటువంటి వ్యాపారస్తులను కఠినంగా శిక్షించాలని రైతులు కోరుతున్నారు. 


సంవత్సరం నుంచి మోసం చేస్తున్నాడు..  రామాంజనేయ రెడ్డి, గంగంపల్లి

గంగంపల్లె గ్రామంలో భారీ ఎత్తున పత్తి పంటను సాగు చేస్తున్నాను.  ఈ క్రమంలో కొమరోలు మండలం పోసుపల్లె గ్రామానికి చెందిన పి.వెంకటయ్య కాటా ద్వారా మోసం చేస్తున్నాడని గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి చెప్పాడు. మూడు రోజులక్రితం ఐదున్నర క్వింటా పత్తిని ఆయనకు అమ్మాను. అమ్మితే కాటాలో కేవలం 2.30 క్వింటాళ్ళు మాత్రమే చూపించింది. ఇలాంటి దళారులను పోలీసులు కఠినంగా శిక్షించాలి.       

Updated Date - 2020-10-27T07:07:43+05:30 IST