విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

ABN , First Publish Date - 2020-10-13T08:33:35+05:30 IST

విద్యుత్‌షాక్‌ తగిలి రైతు దుర్మరణం పాలైన ఘటన మండలంలోని చెరువుకొమ్ముపాలెంలో సోమవారం జరిగింది.

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

దర్శి, అక్టోబరు 12 : విద్యుత్‌షాక్‌ తగిలి రైతు దుర్మరణం పాలైన ఘటన మండలంలోని చెరువుకొమ్ముపాలెంలో సోమవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం... బొట్ల రామకృష్ణ(31) పొలంలో బోరు కింద వరిసాగు చేశాడు. సోమవారం మధ్యాహ్నం సమయంలో పొలానికి నీరు పెట్టుకునేందుకు మోటారు స్విచ్చ్‌ వేశాడు. పక్కనే కరెంట్‌ తీగ కింద పడి ఉంది.


కిందపడి ఉన్న తీగను పక్కకు నెట్టే ప్రయత్నం చేశాడు. తీగకు లూజు కనెక్షన్‌ ఉండడంతో కరెంట్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. అటువైపు వెళ్తున్న రైతులు కిందపడి ఉన్న రామకృష్ణను చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణకర్త విద్యుత్‌ షాక్‌తో దుర్మరణం చెందటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Updated Date - 2020-10-13T08:33:35+05:30 IST