-
-
Home » Andhra Pradesh » Prakasam » ong news
-
ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు
ABN , First Publish Date - 2020-10-07T07:33:46+05:30 IST
గుడిలో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు తాలుకా ఇన్‌స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి చెప్పారు.

ఒంగోలు(క్రైం), అక్టోబరు 6 : గుడిలో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు తాలుకా ఇన్‌స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి చెప్పారు. గత నెల 15న ఒంగోలు మండలం చేజర్లలోని అమ్మవారి గుడిలో హుండీ పగులగొట్టి సుమారు రూ.80వేలు అపహరించారు. ఈ సంఘటనకు పాల్పడిన పేర్నమిట్టకు చెందిన చిటితోటి మధుబాబును మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ వద్ద ఎస్సై సమీముల్లా తన సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.18,300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.