ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు
ABN , First Publish Date - 2020-10-04T10:19:48+05:30 IST
మండలంలో ప్రభుత్వ, అటవీ భూముల ను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సిహెచ్.
పామూరు, అక్టోబరు 3 : మండలంలో ప్రభుత్వ, అటవీ భూముల ను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సిహెచ్.ఉషా హెచ్చరించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలతో శనివారం సమావేశం నిర్వహించారు. బోడవాడ, అయ్యవారిపల్లి తో పాటు పలు గ్రామాల్లోని కొందరు ప్రభుత్వ, అటవీ భూ ములు ఆక్రమిస్తున్నవారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని సూచించారు. నిమ్జ్, కారిడార్ పరిధిలో 95 మంది భూఆక్రమణలకు పాల్పడ్డారని, దీనిపై వెంటనే సమగ్రంగా విచారించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో డీటీ ఆర్ నాసరుద్దీన్, ఎంఆర్‌ఐ పి. మాధవరావు పాల్గొన్నారు.