ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు స్వాట్‌

ABN , First Publish Date - 2020-10-04T10:16:46+05:30 IST

రాష్ట్రంలో ఉగ్రవాదులను ఎదుర్కొనే విధంగా పోలుసుశాఖలో స్వాట్‌ టీంను జిల్లాలో ఏర్పాటు చేశామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. శనివారం రాత్రి స్థానిక పోలీసు కల్యాణ మండలంలో స్వాట్‌ టీం ఆవిర్భావ దినోత్సవం జరిగింది.

ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు స్వాట్‌

ఒంగోలు క్రైం అక్టోబరు 3 : రాష్ట్రంలో ఉగ్రవాదులను ఎదుర్కొనే విధంగా పోలుసుశాఖలో స్వాట్‌ టీంను జిల్లాలో ఏర్పాటు చేశామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. శనివారం రాత్రి స్థానిక పోలీసు కల్యాణ మండలంలో స్వాట్‌ టీం ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఢిల్లీ బెంగళూరు, ముంబయి తదితర మహానగరాల్లో మాత్రమే ఉండే స్వాట్‌ టీంను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో స్వాట్‌ టీంను ఏర్పాటు చేసి మెరుగైన శిక్షణను ఇప్పించామన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కాలంలో ఈ బృందంలో ఉండి అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు.


ఫైరింగ్‌లో కంఠం శ్రీనివాసరావు, లాంగ్‌రన్‌లో కే.శ్రీనివాసరావు, యుద్ధభూమిలో ఎదురయ్యే అవరోధాలను ఎదుర్కోవడంలో బి.రవికాంత్‌రెండ్డి, ఆల్‌రౌండర్‌గా ఏసుబాబులకు ఎస్పీ చేతుల మీదగా పతకాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ రాఘవేంధ్రరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వి.సూర్యనారాయణ, కమాండ్‌ కంట్రోలు ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు, స్వాట్‌ ఆర్‌ఐ శ్రీకాంత్‌ నాయక్‌, ఎస్సై నయాబ్‌ రసూల్‌, ఆర్‌ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-04T10:16:46+05:30 IST