నేటి నుంచి బెంగళూరుకు మరో బస్సు
ABN , First Publish Date - 2020-10-04T10:14:01+05:30 IST
అద్దంకి నుంచి బెంగళూరుకు మరో బస్సును నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం సుష్మ తెలిపారు.
గ్రామీణ రూట్లలో సర్వీసులు ప్రారంభం
అద్దంకి, అక్టోబరు 3 : అద్దంకి నుంచి బెంగళూరుకు మరో బస్సును నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం సుష్మ తెలిపారు. ఇప్పటి వరకు ఒంగోలు, తిరుపతి మీదుగా బస్సు వెళ్తుండగా, ఆదివారం నుంచి ప్రతి రోజు సాయం త్రం 5-30 గంటలకు మరో బస్సు అద్దంకి నుంచి బయలుదేరి పొదిలి, కనిగిరి, పామూరు, సీఎస్‌పురం, పోరుమామిళ్ల, కడప మీదుగా బెంగళూరుకు మరునాడు 7 గంటలకు చేరుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణం బెంగళూరులో రాత్రి 8 గంటలకు మొదలై మరుచటి రోజు ఉదయం 8 గంటలకు అద్దంకి చేరుకుంటుందని తెలిపారు.
అలాగే అద్దంకి నుంచి విజయవాడ, నర్సరావుపేట, ఒంగోలు, పొదిలి, వినుకొండకు బస్సు సర్వీసులు ప్రారంభమైనట్లు తెలిపారు. శనివారం నుంచి వలపర్ల మీదుగా చిలకలూరిపేట, బల్లికురవ మీదుగా నర్సరావుపేట, చందలూరు మీదుగా ఇంకొల్లు, పంగులూరు మీదుగా ఇంకొల్లుకు బస్సులు తిరుగుతున్నట్లు డీఎం తెలిపారు.