మహాత్ముడికి ఉపాధ్యాయుల వినతి
ABN , First Publish Date - 2020-10-03T11:11:49+05:30 IST
లాక్‌డౌన్‌తో 6 నెలలుగా ఉపాధి కోల్పోయిన ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం స్థానిక ప్రధాన సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ఎర్రగొండపాలెం, అక్టోబరు 2 : లాక్‌డౌన్‌తో 6 నెలలుగా ఉపాధి కోల్పోయిన ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం స్థానిక ప్రధాన సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా పీఎల్‌టీయూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మహాత్ముడి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు గుమ్మా రాజయ్య, ఎన్.నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.