రాహుల్‌ అరెస్టు అన్యాయం

ABN , First Publish Date - 2020-10-03T11:10:49+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో గ్యాంగ్‌ రేప్‌కు గురైన దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలపై బీజేపీ సర్కార్‌ దౌర్జన్యం ప్రదర్శించి అరెస్టు చేయడం అన్యాయమని కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్‌ అరెస్టు అన్యాయం

రాహుల్‌ అరెస్టు అన్యాయం

గిద్దలూరు, అక్టోబరు 2 : ఉత్తర ప్రదేశ్‌లో గ్యాంగ్‌ రేప్‌కు గురైన దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు  వెళ్లిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలపై బీజేపీ సర్కార్‌ దౌర్జన్యం ప్రదర్శించి అరెస్టు చేయడం అన్యాయమని కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పగడాల రంగస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలిక కుటుంబానికి న్యాయం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని, అక్రమ అరెస్టులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమండ్‌ చేశారు.  

Updated Date - 2020-10-03T11:10:49+05:30 IST