ఒకే పోలీస్‌ స్టేషన్‌.. ఇద్దరు ఎస్‌ఐలు

ABN , First Publish Date - 2020-12-30T05:57:34+05:30 IST

అద్దంకి పోలీస్‌ స్టేషన్‌కు ఇటీవల రెండవ ఎస్‌ఐని నియమించారు.

ఒకే పోలీస్‌ స్టేషన్‌.. ఇద్దరు ఎస్‌ఐలు
అద్దంకి పోలీస్‌ స్టేషన్‌


కొత్తగా విధుల్లో చేరిన మహిళా ఎస్‌ఐ 

కుర్చీ కూడా కేటాయించని వైనం

పరిధి విభజన జరగక అయోమయం

అద్దంకి, డిసెంబరు 29: అద్దంకి పోలీస్‌ స్టేషన్‌కు ఇటీవల రెండవ ఎస్‌ఐని నియమించారు. రెండవ ఎస్‌ ఐగా భవానిరెడ్డి బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కావస్తున్నా ఇంతవరకు కూర్చునేందుకు కనీసం కుర్చీ కూడా లేని పరిస్థితి. పోలీస్‌ స్టేషన్‌ పరిధి, సిబ్బందిని విభజన చేయకుండా అదనపు ఎస్‌ఐని నియమించి ప్రయోజనం ఏమిటన్న విమర్శలు విన్పిస్తున్నాయి. 

గతంలో వికటించిన ప్రయోగం

నాలుగు సంవత్సరాల క్రితం ఇదే విధంగా అద్దంకి పోలీస్‌ స్టేషన్‌కు ఇద్దరు ఎస్‌ఐలను నియమించిన ప్రయోగం వికటించింది. దీంతో ఇద్దరినీ బదిలీ చేసి తిరిగి ఒక్కరినే నియమిస్తూ వచ్చారు. 2016 సెప్టెం బరు 15న అద్దంకి పోలీస్‌ స్టేషన్‌కు రెహమాన్‌, సంపత్‌కుమార్‌ను నియమించారు. కొద్ది కాలంపాటు ఇద్దరు  ఒకే గదిలో కూర్చొని విధులు నిర్వహించారు. సమస్యలు తలెత్తటంతో టౌన్‌కు రెహమాన్‌ను, సంప త్‌కుమార్‌ను రూరల్‌ మండలానికి కేటాయించారు. రైటర్‌ వినియోగించుకునే గదిని రూరల్‌ ఎస్‌ఐకి  కే టాయించారు.  సిబ్బందిని మాత్రం విభజించలేదు. దీంతో సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయి  ఎస్‌ఐ లపై ఒకరిపై ఒకరు చెప్తూ పని నుంచి తప్పించు కున్నారు. ఇద్దరి ఎస్‌ఐల ఆధిపత్య పోరు పెరిగింది.  

ఏడాది తిరగకుండానే..

ఈ నేపథ్యంలో ఇద్దరు ఎస్‌ఐలను ఏడాది కూడా తిరగకుండానే 2017 మే 8న బదిలీ చేసి ఒక ఎస్‌ఐని కేటాయించారు. ప్రస్తుతం కూడా అదేవిధంగా ఇద్దరు ఎస్సైలు  విధులు నిర్వ హించే  పరిస్థితి వచ్చింది.  రెండవ ఎస్సైగా వచ్చిన భవానిరెడ్డికి కుర్చీ కూడా లేని పరిస్థితి.  దీంతో స్టేష న్‌కు వస్తే రైటర్‌ రూమ్‌లో సాధారణ పోలీస్‌ మాదిరి కూర్చొని విధులు నిర్వహించాల్సిన  పరిస్థితి ఏర్పడిం ది. సిబ్బంది విభజన కూడా జరగకపోవటంతో  ఎలా విధులు నిర్వహించాలో అ ర్థంకాని పరిస్థితి నెలకొంది.  ఇద్దరూ ఒకే హోదా అధి కారులు కావడంతో సమస్య లు తలెత్తే అవకాశం ఉంది. 

పని విభజన జరగక సమస్యలు

అద్దంకి పట్టణం, రూరల్‌ పరిధిలో సు మారు లక్ష జనాభా ఉన్నారు.  ఈ స్థితిలో ఒక్క ఎస్‌ఐ విధులు నిర్వహించడమూ కష్టమే.  రెండవ ఎస్సై నియమించ టం ద్వారా ప్రయోజనం ఉన్నప్పటికీ సిబ్బంది విభజ న, ప్రత్యేక గదిని కేటాయించకుండా విధులు  నిర్వ హించే క్రమంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంద ని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన  పరిస్థితి పునరావృతం కాక ముందే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.


Updated Date - 2020-12-30T05:57:34+05:30 IST