సీఎం సహాయ నిధికి ఒక రోజు వేతనం

ABN , First Publish Date - 2020-03-27T10:13:47+05:30 IST

కరోనా కట్టడి కోసం ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఒక రోజు వేతనాన్ని సీఎం సహాయ

సీఎం సహాయ నిధికి ఒక రోజు వేతనం

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 26 : కరోనా కట్టడి కోసం ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు  ఏపీ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఒక రోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి అందజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖను అందజేసినట్టు ప్రభుత్వ డ్రైవర్ల సంఘ జిల్లా  అధ్యక్షుడు వాసాల ప్రసన్న ఆంజనేయ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ డ్రైవర్లు విధి నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకొని విధులు నిర్వహించాలని వారు కోరారు. డ్రైవర్లు మాస్కులు వాడడంతో పాటు శానిటైజర్లును కూడా వినియోగించి ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రసన్న తెలిపారు. 

Updated Date - 2020-03-27T10:13:47+05:30 IST