అనారోగ్యంతో మనస్తాపం చెంది వృద్ధుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-16T03:59:52+05:30 IST

ఓ వృద్ధుడు తన ఆలనాపాలనా చూసేవారు లేకపోవడంతోపాటు అనారోగ్యంతో మనస్తాపానికి గురై నీటి కుంటలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వలేటివారిపాలెంలో మంగళవారం జరిగింది.

అనారోగ్యంతో మనస్తాపం చెంది వృద్ధుడి ఆత్మహత్య
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై హజరత్తయ్య



వలేటివారిపాలెం, డిసెంబరు 15 : ఓ వృద్ధుడు తన ఆలనాపాలనా చూసేవారు లేకపోవడంతోపాటు అనారోగ్యంతో మనస్తాపానికి గురై నీటి కుంటలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వలేటివారిపాలెంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... వలేటివారిపాలేనికి చెందిన కాకుమూను తిరుపతయ్యకు తన భార్య మల్లేశ్వరితో 20 ఏళ్ల క్రితం మనస్పర్థలు ఏర్పడి విడివిడిగా ఉంటున్నాడు. ఆమె తన కొడుకును తీసుకునిపోయి పుట్టిల్లు అయిన పీసీపల్లి మండలం లక్ష్మక్కపల్లె వెళ్లిపోయింది. అప్పటి నుంచి తిరుపత్తయ్య తన అన్న వెంకయ్య దగ్గర ఉంటున్నా.. ఎక్కడిపడితే అక్కడే తింటూ ఉండేవాడు. ఇటీవల కాలంలో ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆలనాపాలనా చేసేవారు లేరని మనస్తాపం చెంది తిరుగుతుండేవాడు. ఈ నేపథ్యంలో కుంటలో అతను శవమై తేలాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ చావా హజరత్తయ్య సంఘటనా స్థలానికి వెళ్లి తహసీల్దారు సమక్షంతో మృతదేహాన్ని బయటకు తీయించి కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీటి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా, స్నానానికి నీటి కుంట వద్దకు వెళ్లి జారి పడి ఉంటాడా అని పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Updated Date - 2020-12-16T03:59:52+05:30 IST