-
-
Home » Andhra Pradesh » Prakasam » Nutrition should be provided to the beneficiaries of the Anganwadi centers
-
అంగన్‌వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులకు ఇంటికే పౌష్టికాహారం అందజేయాలి
ABN , First Publish Date - 2020-03-24T10:51:38+05:30 IST
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులుగా ఉన్న వారికి ఏడు రోజులకు సరిపడా పౌష్టికాహారాన్ని ఒకేసారి అందజేయాలని

ఒంగోలు నగరం, మార్చి 23 : జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులుగా ఉన్న వారికి ఏడు రోజులకు సరిపడా పౌష్టికాహారాన్ని ఒకేసారి అందజేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులకు కేంద్రాలు మూసివేసి ఉన్నందున వెంటనే వారికి అందాల్సిన అన్ని పౌష్టికాహార వస్తువులు వారి ఇళ్లకే వెళ్లి అందజేయాలని కోరారు. లబ్ధిదారులందరికీ వీటిని ఇళ్లకు అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
బాలసంజీవని, వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద అందించాల్సిన పౌష్టికాహారాన్ని అందజేయాలని కోరారు. టేక్ హోం రేషన్‌ను ప్రతి లబ్ధిదారునికి అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉంటే సూపర్‌వైజర్, సీడీపీవో పంపిణీ చేయాలని చెప్పింది. చౌకధరల దుకాణం నుంచి ఈ రేషన్ సరుకులను సకాలంలో తీసుకుని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.