వైద్యారోగ్యశాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2020-10-07T17:30:41+05:30 IST

వైద్యారోగ్యశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 225 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్..

వైద్యారోగ్యశాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌

225 పోస్టుల ప్రకటన

కాంట్రాక్టు పద్ధతిపై నియామకం

ఈనెల 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ


ఒంగోలు: వైద్యారోగ్యశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 225 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మంగళవారం నుంచి ఈనెల 12వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  జిల్లాలోని ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఒంగోలులో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిపై భర్తీ చేయనున్నారు. ఇందులో మెడికల్‌  కేటగిరీలో 15, నర్సింగ్‌, పారామెడికల్‌  విభాగంలో 196 పోస్టులు, ఇతర కేటగిరీల్లో 14 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అందుకు సంబంధించిన విద్యార్హతలు, రిజర్వేషన్లు, లోకల్‌, నాన్‌లోకల్‌ తదితర అంశాలన్నింటినీ నోటిఫికేషన్‌లో ప్రకటించారు. 

Read more