ట్రాక్టర్‌లకు ‘రాయితీ’ లేదట !

ABN , First Publish Date - 2020-12-20T05:39:26+05:30 IST

ఖరీఫ్‌ గడిచింది, రబీ సీజన్‌ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చినట్లే. కానీ రాయితీ యంత్రాలకు మోక్షం లభించడం లేదు. అవి రాకపోగా ప్రభుత్వం తీసుకునే వింత నిర్ణయాలతో రై తులు నివ్వెరపోతున్నారు.

ట్రాక్టర్‌లకు ‘రాయితీ’ లేదట !


వ్యవసాయ యంత్ర పరికరాల మంజూరులో మరో కొర్రీ

ఇతర పరికరాలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయం 

అన్నదాతల అనాసక్తిఒంగోలు(జడ్పీ), డిసెంబరు 19: ఖరీఫ్‌ గడిచింది, రబీ సీజన్‌ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చినట్లే. కానీ రాయితీ యంత్రాలకు మోక్షం లభించడం లేదు. అవి రాకపోగా ప్రభుత్వం తీసుకునే వింత నిర్ణయాలతో రై తులు  నివ్వెరపోతున్నారు. కస్టమ్‌హైరింగ్‌ సెంటర్లను (రైతులతో గ్రూపులు) ఏర్పాటు చేసి వారి చేత బ్యాంకు ఖాతాలు కూడా తెరిపంచారు. అక్రమంలో ప్ర భుత్వం తాజాగా ఒక వింత నిర్ణయం తీసుకుంది. రా యితీకి అందించే పరికరాల్లో ట్రాక్టర్‌ను మినహాయించి, మిగతా వాటిని ఎంపిక చేసుకోవాలట. ఈ నిర్ణయంతో అవాక్కవడం గ్రూపుల వంతయింది. రైతులకు అవసర మయిన యంత్రపరికరాలలో ట్రాక్టర్‌దే అగ్రస్థానం. చి న్న, సన్నకారు రైతులు కూడా సొంతంగా ట్రాక్టరు ఉం టే తమకు ఖర్చులు కలిసి వస్తాయని ఆశపడతారు. అలాంటిది రాయితీకి అందించే పరికరాల్లో ట్రాక్టర్‌ను మినహాయించడం అంటే రైతుల ప్రయోజనాలకు నిలు వునా పాతరేసినట్లే. ఈనేపథ్యంలో ట్రాక్టర్‌ ఇవ్వకుండా ఇతర పరికరాలు తీసుకునేందుకు రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. జిల్లాలోని 879 రై తుభరోసా కేంద్రాల పరిధిలో గ్రూపుల ఏర్పాటుకు జి ల్లా వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తీరా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మళ్లీ తిరో గమన దిశలోకి కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ప్రక్రియ వెళ్ల నుంది. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తు ందని, త్వరలోనే ట్రాక్టర్‌లపై స్పష్టత వచ్చే అవకా శముందని యంత్రాంగం చెబుతోంది. నిబంధనల పేరిట ప్రభుత్వం ఇలా కాలయాపన చేయడంతో రబీ సీజన్‌లో కూడా వాటి మీద అన్నదాతలు ఆశలు వద లుకున్నారు


కంపెనీలు కూడా షరతులు


దీనికితోడు తమకు రావాలింసన పాత బకాయిలు ఇస్తేనే పరికరాలకు సంబంధించి కొటేషన్లు ఇస్తామని ఆయా కంపెనీల డీలర్లు చెబుతున్నట్లు సమాచారం. బ్యాంకులు రుణం మంజూరు చేయాలంటే ముందుగా పరికరాలకు సంబంధించి కొటేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ట్రాక్టర్‌ లేకుండా కూడా పరికరాలు తీసు కోవడానికి ముందుకొచ్చిన కొద్దిమందికి సైతం కంపె నీలు మోకాలడ్డడంతో రాయితీ యంత్రాల వ్యవహారం అడుగు ముందుకి, ఏడడుగులు వెనక్కి అనే చందంగా తయారయింది.


Updated Date - 2020-12-20T05:39:26+05:30 IST