-
-
Home » Andhra Pradesh » Prakasam » no policeing in ongole
-
పహారా..పడకేసిందా?
ABN , First Publish Date - 2020-12-27T06:10:51+05:30 IST
ఒంగోలు నగరంలో నే రాల అలజడి పెరుగు తోంది. లాక్‌డౌన్ తరు వాత క్రమంగా పలు సంఘటనలు జరగ డం ఇందుకు నిద ర్శనంగా నిలుస్తో ంది. పట్టప గలు హత్యలు, ని ట్ట నిలువునా దోపి డీలు, ఆపై దొంగత నాలు యథేచ్చగా జరు గుతున్నాయి.

ఒంగోలుపై కొరవడిన పోలీస్ నిఘా
ఇటీవల వరుసగా నేరాలు
రాత్రి దొంగతనాలు
పగలు హత్యలు..ఆత్మహత్యలు
పోలీసుల్లో సమన్యయలోపం
ఆందోళనలో నగరవాసులు
ఒంగోలు నగరంలో నేరాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన ఘటనలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. చోరీలు, ఆత్మహత్యలు, ఏకంగా హత్యలు కూడా రాత్రి, పగలు అనే తేడా లేకుండా జరుగుతున్నాయి. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. అయితే నిత్యం పోలీసు పహారా ఉండాల్సి ఉండగా.. శాఖలో సమన్వయంలోపం వల్ల నేరాలు అరికట్టడంలో విఫలమవుతున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి...!
ఒంగోలు(క్రైం), డిసెంబరు 26: ఒంగోలు నగరంలో నే రాల అలజడి పెరుగు తోంది. లాక్‌డౌన్ తరు వాత క్రమంగా పలు సంఘటనలు జరగ డం ఇందుకు నిద ర్శనంగా నిలుస్తో ంది. పట్టప గలు హత్యలు, ని ట్ట నిలువునా దోపి డీలు, ఆపై దొంగత నాలు యథేచ్చగా జరు గుతున్నాయి. గతంలో నగరంలో ప లావు పొట్లానికి హత్య జరిగే పరిస్థితి ఉండేది. రాత్రులు కరెంట్ పోతే కచ్చితం గా ఎక్కడో ఒక చోట హత్య జరిగిన సంద ర్భాలు అనేకం. వీధికో రౌడీ ఉండేవాడు. అలాంటి పరిస్థితిని అప్పట్లో ఉన్న పోలీస్ ఉ న్నతాధికారులు దృష్టి సారించి అదుపులోకి తె చ్చారు. అయితే రెండు దశాబ్ధాల తరువాత నా టి పరిస్థితిని పునరావృతం జరుగుతుందనేందు కు అనేక ఉదాహరణలు అద్దం పడుతున్నా యి. దీంతో ప్రజలు భయం గుప్పిట్లో జీ విస్తున్నారు.
పోలీసు సిబ్బంది పెరిగినా..
ఒంగోలులో నాడు కేవలం మూ డు పోలీస్ స్టేషన్లు, అక్కడ ఎ స్‌హెచ్‌వోగా ఎస్‌ఐ పనిచేసేవారు. మూడు స్టేషన్లుకు ఒక సర్కిల్ ఇ న్‌స్పెక్టర్ ఉండేవారు. ప్రస్తుతం అలా కాదు... నగరంలో మూడు పోలీ స్‌స్టేషన్లకు ఎస్‌హెచ్‌వోగా ఇన్‌స్పెక్టర్ ప నిచేస్తుండగా, అక్కడ ముగ్గురుకు తగ్గకుండా ఎస్‌ఐలు ఉన్నారు. ఇంకా ట్రాఫిక్‌కు ఒక ప్రత్యేకమైన పో లీస్‌స్టేషన్, అక్కడ ఓ డీఎస్పీ, దిశా మహిళా పోలీస్ స్టేషన్ అక్కడ ఓ డీఎస్పీ, సీసీఎస్ పోలీస్ స్టేషన్ అక్కడ ఎస్‌హె చ్‌వోగా డీఎస్పీ పనిచేస్తున్నారు. అందుకు తగినంత మంది సిబ్బంది ఉన్నారు. అలాగే నగ రంలో నాలుగు రక్షక్ వాహనా లు, ఏడు బ్లూకోట్సు మోటార్ సైకిళ్లు సిబ్బంది నిత్యం గస్తీ తి రుగుతున్నారు. ఇంతమంది పో లీసులు ఉన్నప్పటికి నగరంలో నేరాలు పెరగడం చర్చనీయాం శంగా మారింది.
కొరవడిన నిఘా..
ముఖ్యంగా ఒంగోలు నగర శివారు ప్రాంతాలపై పోలీసుల కు నిఘా కొరవడింది. ఇటీవల జరిగిన దోపిడీలు, దొంగతనాలు, ఆత్మహత్యలు అందుకు ని దర్శనం. అంతేగాకుండా జనసంచారం అధికంగా ఉన్న ప్రాం తాల్లో సైతం పోలీసుల కదలికలు కనిపించడం లేదు. ప్రఽ దానంగా విజుబుల్ పోలిసింగ్ పెద్దగా లేదు. గతంలో శివా రు ప్రాంతాల్లో అనేక చోట్ల జరిగిన ఘటనలు దృష్టిలో ఉం చుకొని పోలీసు ఉన్నతాధికారులు బ్లూకోట్స్, రక్షక్ వ్యవస్ధను పటిష్టపరిచారు. అయితే ప్రస్తుతం బ్లూకోట్స్ సిబ్బంది స్టేషన్ అవసరాలకు వినియోగిస్తుండగా, రక్షక్ వాహనాలు ఎవరు మరమ్మతులు చేయిస్తారని ఎదురుచూస్తున్నాయి. నగర న ట్టనడిబొడ్దున జరిగిన యువకుడి హత్యను పరిశీలిస్తే పోలీ సుల పహారా ఏవిధంగా ఉందనేది అర్ధమవుతున్నది. ఉద యం పది గంటలకు రద్దీగా ఉండే ప్రదేశం రంగారాయుడు చెరువు. ఆ పక్కనే ఉన్న గాంధీ పార్కు వద్ద జరిగిన హత్య నగర ప్రజలను బెంబేలెత్తించింది. గత శుక్రవారం భువనే శ్వరి అనే దివ్యాంగురాలు శివారు ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఒంటరిగా పెట్రోల్ తీసుకొని వెళుతుంటే ఏ ఒక్క కానిస్టేబుల్ గుర్తించలేకపోయారు. పైగా ఆమె ఆరు గంటల సమయంలో ఒక్కరే వెళ్లారు. ఆ సమయంలో పో లీసులు గస్తీ తిరుగుతుంటారు. అయినప్పటికీ ఎవరూ ఆమెను పసిగట్టలేదు.
నేరాలకు అడ్డాగా శివారు ప్రాంతాలు
గతంలో చీమకుర్తికి చెందిన గరికమిట్ట గ్యాంగ్ నిశబ్ద దా రుణకాండ కొనసాగించారు. మంగమూరు సమీపంలో సుబాబుల్ తోటలోకి ఏకాంతంగా వెళ్ళిన జంటపై దాడి చేసి మహిళపై అత్యాచారం చేశారు. పేర్నమిట్టి శివారు ప్రాం తంలో గల ముళ్లపొదల్లో తల్లీకూతురును దారుణంగా హ తమార్చిన ఘటన ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఇలా శివా రు ప్రాంతాల్లో అనేక ఘటనలు జరిగాయి. ప్రస్తుతం ఏకం గా దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయి. ఇప్పటికైన పోలీ సులు స్పందించి సమన్యయంతో వ్యహరించి ఇలాంటి నేరా లకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇటీవల జరిగిన ఘటనలు
ఈ నెల 15 ఉదయం 10 గంటల సమయంలో రంగారాయుడు చెరువు వద్ద ఉన్న గాంధీపార్కు వద్ద స్థానిక ప్రకాశంకాలనీకి చెందిన పసుమర్తి ఽథామస్ అనే యువకుడు దారుణంగా హత్యకుగురయ్యాడు. అప్పుడే కార్తీకదీపాలు వెలిగించి ఇళ్ళకు వెళుతున్న మహిళలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఈ నెల 16న ఉదయం 11.30 గంటల సమయంలో రంగారాయుడు చెరువులో 11నెలల బిడ్డను తల్లి చున్నీతో కట్టుకొని దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె గోపాలునగరంలో నివాసం ఉంటుంది. ఆత్మహత్య చేసుకునేందుకు అక్కడకు వచ్చింది. అక్కడ వాచ్‌మెన్ గానీ, పోలీసులు గస్తీ లేకపోవడంతో ఇద్దరి ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి.
అదేరోజు మధ్యాహ్నం మారుతీనగర్ రెండో లైన్‌లో ఒంటరిగా ఉంటున్న 70 ఏళ్ల వృద్ధురాలిపై ఇరువురు వ్యక్తులు దాడి చేసి కుర్చీకి కట్టి దోపిడీకి పాల్ప డ్డారు. తాము బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తామని నమ్మబలికి ఇల్లు అద్దెకు కావాలని చెప్పి ఆమె వద్ద ఉన్న బంగారపు ఆభరణాలు అపహరించుకెళ్లారు.
ఈ నెల 17న ఆటోలో పట్టపగలు ఆటోలో ప్రయా ణం చేస్తున్న మహిళ వద్ద ఉన్న సంచిని కోసి బంగారు ఆభరణాలు, నగదును చోరీ చేశారు.
అదేరోజు రాత్రి నగరంలోని విఘ్నేశ్వరస్వామి దేవా లయంలో దుండగులు హుండీ పగలగొట్టి నగదు తస్కరించారు.
ఈ నెల 18న నగరంలోని దశరాజుపల్లిరోడ్డులో దివ్యాంగురాలు భువనేశ్వరి పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం కలిగించింది.
కొద్దిరోజుల క్రితం పట్టప గలు మహిళను మోటారుసైకిల్ ఎక్కుంచుకున్న యువకుడు పే ర్నమిట్ట శివా రుకు తీసు కెళ్లి అత్యా చారయత్నం చేశాడు.
నిఘా పెంచుతాం
నగరంలో విజిబుల్ పోలీస్‌ంగ్ ఏర్పాటు చేశాం. పగలు కూడ పోలీస్ నిఘా పెంచాతాం. ఇటీవల జరిగిన పరిణా మాలలో కొన్ని ఘటనలు వ్యక్తిగతంగా జరిగినవి. శివారు ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేస్తాం. దోపిడీలకు పాల్పడు తున్న వారిని గుర్తించాం. అదేవిధంగా ప్రజలు అపరిచితు ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సహాయం కోసం పోలీసు లకు సమాచారం అందించాలి.
- కేవీవీఎన్‌వీ.ప్రసాద్, డీఎస్పీ, ఒంగోలు
