కొవిడ్ టెర్రర్..కొత్తగా 1,129 పాజిటివ్ కేసులు!
ABN , First Publish Date - 2020-09-12T10:20:30+05:30 IST
జిల్లాలో శుక్రవారం కొత్తగా 1,129 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఒంగోలులో 256, చీమకుర్తిలో 70, చీరాలలో 66, అద్దంకిలో

ఒంగోలు (కార్పొరేషన్) సెప్టెంబరు 11 : జిల్లాలో శుక్రవారం కొత్తగా 1,129 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఒంగోలులో 256, చీమకుర్తిలో 70, చీరాలలో 66, అద్దంకిలో 60, కందుకూరులో 24, నాగులుప్పలపాడులో 18, పామూరులో 14 కేసులు వెలుగుచూశాయి. ఇంకా మండలకేంద్రాలు, పలు గ్రామాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా జిల్లాలో మొత్తం 2,002మంది కరోనాతో చికిత్స పొందుతుండగా, రిమ్స్‌లో 620మంది, కొవిడ్ కేర్ సెంటర్లలో 1,348 మంది, కిమ్స్‌లో 72, సంఘమిత్ర 75,నల్లూరి నర్సింగ్ హోమ్‌లో 38,వెంకట రమణ నర్సింగ్ హోమ్‌లో 26, ప్రకాశం హాస్పిటల్‌లో 25మంది కొవిడ్ చికిత్స పొందుతున్నారు. 92మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఆరుగురు మృతిచెందారు. మరో 104మంది హోమ్ క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.