-
-
Home » Andhra Pradesh » Prakasam » new party for bc
-
బీసీల సంక్షేమం కోసం పార్టీ ఏర్పాటు
ABN , First Publish Date - 2020-12-28T06:05:19+05:30 IST
రాష్ట్రంలో బీసీల సంక్షేమం పార్టీని ఏర్పాటు చేసేందుకు స న్నాహాలు ప్రారంభించినట్లు బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పేర్కొన్నా రు.

రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు
ఒంగోలు(కలెకర్టేట్), డిసెంబరు 27 : రాష్ట్రంలో బీసీల సంక్షేమం పార్టీని ఏర్పాటు చేసేందుకు స న్నాహాలు ప్రారంభించినట్లు బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పేర్కొన్నా రు. ఆదివారం ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సంఘ జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవసభ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై న ఆయన మాట్లాడుతూ బీసీలు రాజ్యాధికారం లోకి వచ్చినప్పుడే సమస్యలు పరిష్కారమవుతా యన్నారు. జిల్లాల్లో సంఘాన్ని బలపేతం చేయా ల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీలకు అతీ తంగా పనిచేయాలని కోరారు. యువజన విభా గం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ మా ట్లాడుతూ బీసీలు ఐక్యతతో ముందుకు సాగాల న్నారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడిగా బండారు సోమరాజు, కార్యదర్శిగా బలగాని ఆం జనేయులు, కోశాధికారిగా అజీజ్, ఉపాధ్యక్షుడిగా పి.నారాయణ, అధికార ప్రతినిధిగా శ్రీదేవి, కార్యవ ర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. గౌరవాధ్య క్షుడు గోనుగుంట బ్రహ్మానందశర్మ సిద్దాంతి అధ్య క్షతన జరిగిన సభలో గోలి తిరుపతిరావు, కఠారి శంకర్, పాశం వెంకటేశ్వర్లు, పి.రాజ్యలక్ష్మి, కె.కోటే శ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.