రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-26T05:16:06+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మూమెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎం. అబ్దుల్‌ సుబాన్‌ అన్నారు. స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తూ రైతులను వారి పొలాల్లో కూలీలుగా మార్చేలా తెచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
మాట్లాడుతున్న ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు సుభాన్‌

ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు సుభాన్‌


మార్కాపురం (వన్‌టౌన్‌), డిసెంబరు 25 : రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మూమెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎం. అబ్దుల్‌ సుబాన్‌ అన్నారు. స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తూ రైతులను వారి పొలాల్లో కూలీలుగా మార్చేలా తెచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఎంపీజే ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం చేసే మంచిని స్వాగతిస్తూనే తప్పులను వ్యతిరేకిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎంపీజే జిల్లా నూతన కమిటీని నియమించారు. అధ్యక్షుడిగా ఎర్రగొండపాలెంనకు చెందిన పి.రసూల్‌ఖాన్‌, ప్రధాన కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన కరిముల్లాను ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా షేక్‌ అమీద్‌, షేక్‌ మున్నా, సయ్యద్‌ గఫూర్‌, కోశాధికారిగా షేక్‌ కరిముల్లాను నియమించారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర కోశాధికారి షేక్‌ అబ్దుల్‌ రజాక్‌, రాష్ట్ర ఫౌండర్‌ సభ్యులు షేక్‌ అబ్దుల్‌ రహీం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-26T05:16:06+05:30 IST