-
-
Home » Andhra Pradesh » Prakasam » neftueen fight
-
బావపై బావమరిది కొడవలితో దాడి
ABN , First Publish Date - 2020-12-07T03:54:40+05:30 IST
పొలం విషయంలో జరిగిన వివాదంలో బావపై బావమరిది కొడవలితో దాడి చేసిన ఘటన భగవాన్‌రాజుపాలెంలో జరిగింది. దీనిపై స్థానిక పోలీ్‌సస్టేషన్లో ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.

పంగులూరు, డిసెంబరు 6 : పొలం విషయంలో జరిగిన వివాదంలో బావపై బావమరిది కొడవలితో దాడి చేసిన ఘటన భగవాన్‌రాజుపాలెంలో జరిగింది. దీనిపై స్థానిక పోలీ్‌సస్టేషన్లో ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. భగవాన్‌రాజుపాలెనికి చెందిన జండ్రాజుపల్లి కృపారావు శనివారం తన పొలంలో పనిచేస్తూ మధ్యాహ్నం గట్టుపై విశ్రాంతి తీసుకునే సమయంలో అతని బావమరిది చింతలచెరువు పెద అంజయ్య కొడవలితో దాడి చేశాడు. గాయాల పాలైన కృపారావును చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దాడికి పాల్పడిన పెద అంజయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.