-
-
Home » Andhra Pradesh » Prakasam » navodaya applying date extention
-
నవోదయ దరఖాస్తుకు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-12-27T06:19:59+05:30 IST
జవహర్ నవోదయ విద్యాలయంలో 2021-22 విద్యాసంవ త్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు ఈనెల 29లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు లు సమర్పించాలని ఒంగోలు జవహర్ నవోదయ ప్రిన్సిపాల్ జయశ్రీ శనివారం ప్రకటనలో తె లిపారు

ఒంగోలువిద్య, డిసెంబరు 26 : జవహర్ నవోదయ విద్యాలయంలో 2021-22 విద్యాసంవ త్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు ఈనెల 29లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు లు సమర్పించాలని ఒంగోలు జవహర్ నవోదయ ప్రిన్సిపాల్ జయశ్రీ శనివారం ప్రకటనలో తె లిపారు ఒంగోలు, కందుకూరు డివిజన్ పరిధిలోని 29 మండలాల విద్యార్థులు దరఖాస్తు చేసు కొనేందుకు అర్హులన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ కోసం ఒంగోలు జవహర్‌నవోదయ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. పరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 11న పరీక్ష జరుగుతుందన్నారు.