-
-
Home » Andhra Pradesh » Prakasam » natu saara sellers arrest
-
నాటుసారా విక్రేతల అరెస్టు
ABN , First Publish Date - 2020-12-28T06:12:50+05:30 IST
అక్రమంగా నాటుసారా తయారు చేసి విక్రయించేందుకు ఆటోలో తరలిస్తుండగా విక్రేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెద్ద దోర్నాల, డిసెంబరు 27 : అక్రమంగా నాటుసారా తయారు చేసి విక్రయించేందుకు ఆటోలో తరలిస్తుండగా విక్రేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని పనుకుమడుగు గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ప్రత్యేక నిఘా శాఖ అధికారులు అందించిన సమాచారంతో ఎస్సై ఉయ్యాల హరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో పనుకుమడుగు గ్రామం నుంచి దోర్నాల సుందరయ్య కాలనీకి అక్రమంగా నాటుసారాను తరలిస్తున్న ఆటోను తనీఖీలు నిర్వహించారు. 140 లీటర్ల నాటుసారా లభించింది. ఆటోలో ఉన్న నలుగురితో పాటు డ్రైవరును అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆటోను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు హాజరు పరిచనునట్లు ఎస్సై తెలిపారు.