పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలి
ABN , First Publish Date - 2020-10-24T12:14:36+05:30 IST
టిడ్కో పూరి ్తచేసిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిం చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ డిమాండ్ చేశారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ డిమాండ్
కనిగిరి, అక్టోబరు 23: టిడ్కో పూరి ్తచేసిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిం చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ డిమాండ్ చేశారు. స్థానిక దరిశి చెంచయ్య భవనంలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్ల కోసం పేదలు అప్పులు చేసి వాటాధనం చెల్లిం చారన్నారు. ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకు రుణం కూడా తీసుకున్నారని చెప్పారు. వైసీపీ ప్రభు త్వం ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో బ్యాంకు వడ్డీలు పెరిగే అవకాశం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం పంతంతోనే పూర్తయిన ఇళ్లను స్వాధీనం చేయ కుండా మీనమేషాలు లెక్కిస్తుందని నారాయణ ధ్వజమెత్తారు.
ఇళ్లకు సంభందించి బ్యాంకు రుణాలు రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇంతవరకు వాటిని పంపిణీ చేయకపోవడం కక్ష సాధింపుకు నిదర్శనమన్నారు. చాకిరాల వద్ద నిర్మించిన జీప్లస్త్రీ ఇళ్లలో 912 మంది ఇళ్ల లబ్ధిదారులకు జాబితాను సిద్ధం చేసి లబ్ధిదార ుల తరపున పోరాటానికి సిద్ధమవుతున్నట్టు చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించక పోతే నవంబర్ 16న ఇళ్ల లబ్ధిదారులు స్వాధీనం చేసుకొని వాటిలోనే నివాసం ఉండేలా సిపిఐ చొరవ చూపుతుందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యు డు వై రవీంద్రబాబు, ఏఐటీయూసీ జిల్లా కార్య దర్శి గుజ్జుల బాలిరెడ్డి, యాసిన్, జీపీ రామా రావు, బృంగి సుబ్రమణ్యం, స్టాలిన్, సుబ్బారావు, రాములు తదితరులు పాల్గొన్నారు.