‘ఉగ్ర’ అడుగు జాడల్లో నడుస్తాం

ABN , First Publish Date - 2020-04-28T10:34:18+05:30 IST

ప్రజా శ్రేయస్సుకోసం, పేదల సంక్షేమం కోసం నిత్యం పాటుపడే టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

‘ఉగ్ర’ అడుగు జాడల్లో నడుస్తాం

కనిగిరి టౌన్‌, ఏప్రిల్‌ 27: ప్రజా శ్రేయస్సుకోసం, పేదల సంక్షేమం కోసం నిత్యం పాటుపడే టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అడుగు జాడల్లో నడుస్తామని కనిగిరి మండలం బొమ్మిరెడ్డిపల్లి టీడీపీ యువత అన్నారు. మండల పరిధిలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం టీడీపీ యువత ఆధ్వర్యంలో బొమ్మిరెడ్డిపల్లి, రాగిమానిపల్లి, గుండ్లపాలెం, వెంకటేశ్వరపురం, వెన్నపూసపల్లి, బిజ్జంవారిపల్లి గ్రామాలకు చెందిన పేదలకు 12 రకాల నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  తెలుగు యువత, గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-28T10:34:18+05:30 IST