ఆ నగదు..బంగారానికి సంబంధించినదే !
ABN , First Publish Date - 2020-07-18T11:08:42+05:30 IST
రాజకీయా లతో సంబంధం లేకుండా నల్లమల్లి ఎక్స్‌క్లూజివ్ షాపు ద్వారా గత వందేళ్ల నుంచి వ్యాపారం చే స్తున్నామని, చెన్నై వద్ద ..

రాజకీయ కోణంలో చూడొద్దు
కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ను డ్రైవర్ అతికించాడు
నల్లమల్లి బాలు వెల్లడి
ఒంగోలు(కలెక్టరేట్), జూలై 17 : రాజకీయా లతో సంబంధం లేకుండా నల్లమల్లి ఎక్స్‌క్లూజివ్ షాపు ద్వారా గత వందేళ్ల నుంచి వ్యాపారం చే స్తున్నామని, చెన్నై వద్ద పట్టుబడిన డబ్బు తమ బంగారు నగలకు సంబంధించినదేనని నల్లమ ల్లి ఎక్స్‌క్లూజివ్ షాపు యజమాని నల్లమల్లి బా లు వెల్లడించారు. శుక్రవారం స్థానిక గోల్డ్‌మ ర్చంట్స్ అసోసియేషన్ హాలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 22 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోందని, సడలింపులు ఇచ్చిన సమయంలో ఇక్కడ అమ్మ గా వచ్చిన డబ్బులతో చెన్నై, కోయంబత్తూరు ముంబాయి తదితర ప్రాంతాల్లో బంగారు వస్తు వులు కొనుగోలు చేసి తీసుకొని వస్తుం టామన్నారు. తమకు నగల వ్యాపారంతో పాటు బంగారం రిటైల్, హోల్‌సేల్ వ్యాపారం కూడా ఉందని, అందువల్ల ఎక్కువ మొత్తంలో కొనుగో లు చేసి తీసుకు వస్తుంటామని ఆయన స్పష్టం చేశారు.
మూడు రోజుల క్రితం చెన్నై సమీపం లో ఆ రాష్ట్ర పోలీసులు కారును ఆపి అందులో ని డబ్బులను ఐటీకి అప్పగించారని, అందుకు సంబంధించి అధికారులు కూడా తమ షాపును పరిశీలించి రికార్డులు చూసిన అనంతరం రూ. 5.22 కోట్లు తమవేనని నిర్ద్ధాంచి నోటీసు కూడా ఇచ్చారని ఆయన చూపించారు. అయితే చెన్నైకి చెందిన తమ బంధువుల కారుకు డ్రైవర్ గడు వు తీరిన ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించారని, ఆ సంగతి తనకు తెలియదని వెల్లడించారు. గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తాతా ప్ర సాద్ మాట్లాడుతూ వ్యాపారాలు, రాజకీయాలు వేర్వేరన్నారు. వ్యాపారులు నిత్యం లావాదేవీలు నడుపుతుంటారని, అంతమాత్రాన పట్టుకున్న డబ్బులను రాజకీయకోణంలో మాట్లాడటం తగ దని స్పష్టం చేశారు. ఆ నగదుకు సంబంధించి న అన్ని ఆధారాలను కూడా ఐటీకి అప్పగించిన ట్లు చెప్పారు. సమావేశంలో వేమూరి సూర్య నారాయణ, రమేష్, దాసరి నారాయణరావు, న ల్లమల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.