వయోజన విద్య సిబ్బందికి నాడు-నేడు బాధ్యతలు
ABN , First Publish Date - 2020-07-27T11:03:15+05:30 IST
జిల్లాలోని వయోజనవిద్య అధికారులు, సూ పర్‌వైజర్లకు నాడు-నేడు పథకం కింద జరుగుతున్న పనుల బాధ్యతలు అ ప్పగిస్తూ జేసీ-2 చేతన్

ఒంగోలువిద్య, జూలై 26 : జిల్లాలోని వయోజనవిద్య అధికారులు, సూ పర్‌వైజర్లకు నాడు-నేడు పథకం కింద జరుగుతున్న పనుల బాధ్యతలు అ ప్పగిస్తూ జేసీ-2 చేతన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణాలను సమర్ధవంతంగా పర్యవేక్షించేందుకు, పనులు వే గం పెంచేందుకు వయోజన విద్య సిబ్బందిని వివిధ నియోజకవర్గాలకు కే టాయించారు. వీరు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళి నిర్మాణాలు జరుగుతున్న తీరు పరిశీలించి నివేదికలను డీఈవో కార్యాలయంలోని అసిస్టెంటు డైరెక్టర్- 2కు సమర్పించాలని సూచించారు. వయోజన విద్య సిబ్బంది డ్రాప్ అవుట్ బాలికలను గుర్తించి వారిని కేజీబీవీల్లో చేర్పించటం, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, డ్రైరేషన్ పంపిణీ కార్యక్రమాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు.