-
-
Home » Andhra Pradesh » Prakasam » motar cycles acident
-
రెండు మోటారు సైకిళ్లు ఢీ - నలుగురికి గాయాలు
ABN , First Publish Date - 2020-12-06T06:03:04+05:30 IST
ఎర్రగొండపాలెం గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై వై.కొత్తపల్లి క్రాస్ వద్ద శనివారం ఉదయం రెండు మోటార్‌సైకిళ్లు ఢీ కొన్నాయి.

ఎర్రగొండపాలెం, డిసెంబరు 5 : ఎర్రగొండపాలెం గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై వై.కొత్తపల్లి క్రాస్ వద్ద శనివారం ఉదయం రెండు మోటార్‌సైకిళ్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలుకాగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వై.కొత్తపల్లి గ్రామం నుంచి మోటారు సైకిల్ పై ఎర్రగొర్ల మల్లయ్య, జె కోటయ్య ప్రయాణిస్తుండగా, అదే సమయంలో మండలంలోని వెంకటాద్రిపాలెం ఎస్టీకాలని నివాసి ఉడతల కిష్ణయ్య, మండ్లి నల్లయ్యలు మరో మోటారు సైకిల్‌పై ఎర్రగొండపాలెం నుంచి మార్కాపురం వైపు వెళుతున్నారు. రెండు మోటారుసైకిళ్లు ఢీ కొన్నాయి. మోటార్ సైకిల్ ప్రయాణిస్తున్న ఎర్రగొర్ల మల్లయ్యకు కాలుకి గాయమైంది. వెనుక కూర్చున్న జె.కోటయ్య స్వల్పంగా గాయపడ్డారు.ఇదే ప్రమాదంలో మరో మోటారు సైకిల్ నడుపుతున్న ఉడతల కిష్ణయ్యకు కాలు విరిగింది. వెనుక ఉన్న మండ్లి నల్లయ్య స్వల్పంగా గాయపడ్డాని పోలీసులు తెలిపారు. తీవ్రం గా గాయపడి కాలువిరిగిన ఎర్రగొర్ల మల్లయ్యను ఉన్నత వైద్యకోసం నరసరావుపేట తీసుకు వెళ్లారు. ఘటనా స్థలాన్ని ఎర్రగొండపాలెం ఎస్సై పి ముక్కంటి పరిశీలించారు.