-
-
Home » Andhra Pradesh » Prakasam » mla meeting
-
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు
ABN , First Publish Date - 2020-11-22T05:01:57+05:30 IST
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ, సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైకాపాకే దక్కిందని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు.

బేస్తవారపేట, నవంబరు 21 : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ, సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైకాపాకే దక్కిందని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. పాదయాత్రలో భాగంగా మండలంలోని రెట్లుపల్లె, పెల్లఓబినేనిపల్లె, చిన్న ఓబినేనిపల్లె,సలకలవీడు,నేకునాంబాద్ గ్రామాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యాక్రమంలో వేగినాటి ఓసూరారెడ్డి,పూనూరు భూపాల్‌రెడ్డి,చిలకల బాలరంగారెడ్డి,చేగిరెడ్డి అనిల్ కుమార్‌రెడ్డి,బండ్ల మూడి వెంకటరాజు,తుపాకుల వెంకటయ్య, తోటకూరి దివాకర్,మిట్టా సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముత్తుములతో మాటామంతి
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిలు శనివారం బేస్తవారపేటలో ఓ వివాహ వేడుకల్లో కలిశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు సరదాగా మాటమంతి పంచుకున్నారు.