ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతు సంఘ నాయకులు

ABN , First Publish Date - 2020-12-15T05:34:36+05:30 IST

వ్యవసాయ చట్టాల బిల్లులను రద్దు చే యాలని కోరుతూ వామపక్షాల రైతులు, ప్రజా సంఘాలు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ కాన్వాయిని అడ్డుకున్న సంఘటన సో మవారం చెప్పుల బజార్‌లో జరిగింది.

ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతు సంఘ నాయకులు
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న రైతులు, నాయకులు


వ్యవసాయ బిల్లుల రద్దుకు మద్దతివ్వాలని డిమాండ్‌ 

సమాధానం దాటవేసిన బుర్రా 

కనిగిరి, డిసెంబరు 14 : వ్యవసాయ చట్టాల బిల్లులను రద్దు చే యాలని కోరుతూ వామపక్షాల రైతులు, ప్రజా సంఘాలు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ కాన్వాయిని అడ్డుకున్న సంఘటన సో మవారం చెప్పుల బజార్‌లో జరిగింది. వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న సం దర్భంలో అదే రోడ్డులో వెళ్తున్న ఎమ్మెల్యేను రైతులు అడ్డుకున్నారు. వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని మద్దతు తెలపాలని ఎమ్మెల్యేని జీపీ రామారావు నిలదీశారు. ఎమ్మెల్యే మాటదాటవేస్తూ ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతుల సమస్యలను తీరుస్తామని చెప్పి కారెక్కి వెళ్లిపోయారు.  కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మస్తాన్‌రావు, మోహన్‌, వెంకటేశ్వర్లు, రామయ్య,  నర్సయ్య, మౌలాలి పాల్గొన్నారు.  అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

కనిగిరి :  వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన ప్ర దర్శన నిర్వహించారు. రైతు సంఘం,  ఏఐటీయూసీ పీసీ కేశవ రావు, పిల్లి తిప్పారెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వ్యవసాయ రం గాన్ని కార్పొరేట్‌ శక్తులకు  అప్పగించేందుకు చూస్తుందని ధ్వజ మెత్తారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు మాలకొండయ్య, శ్రీను, సుబ్బయ్య, వెంకటరెడ్డి, చెన్నకేశవులు పాల్గొన్నారు. 

మార్కాపురం (వన్‌టౌన్‌) :  రైతుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీపీఎం పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి హనీఫ్‌ అన్నారు. రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక హెడ్‌ ఫోస్టాఫీస్‌ ఆఫీస్‌ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు.  రైతు సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డి, అధ్యక్షుడు పిల్లి తిప్పారెడ్డి, సీపీఐ సీనియర్‌ కార్యదర్శి అందె నాసరయ్య, సీఐటీయూ అధ్యక్షుడు డీకేఎంరఫి, సీపీఎం నాయకులు బాల నాగయ్య, వై.సురేష్‌, రైతు సంఘం నాయకులు రామయ్య, ఏఐటీయూసీ నాయకులు కృష్ణగౌడ్‌, రైతు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-15T05:34:36+05:30 IST