-
-
Home » Andhra Pradesh » Prakasam » Misbehavior on SI on Duty
-
విధుల్లో ఉన్న ఎస్సైపై దురుసు ప్రవర్తన
ABN , First Publish Date - 2020-03-24T10:58:49+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది.

ఒంగోలుక్రైం, మార్చి 23 : కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ సందర్భంగా నగరంలో వాహనదారులు తిరగకుండా కట్టడి చేసేందుకు ఒన్‌టౌన్ ఎస్సై ఫాతిమా స్థానిక చర్చి సెంటర్‌లో వాహనదారులను నిలిపి రేపటి నుంచి బయట తిరగవద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఆ సమయంలో ఓ కారును నిలిపి అవగాహన కల్పిస్తుండగా కారులో ఉన్న వృద్ధుడు మహిళా ఎస్సైపై దరుసుగా మాట్లాడాడు.
ఇదే సందర్భంలో ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ అక్కడికి చేరి ఆ వృద్ధుడ్ని గట్టిగా ప్రశ్నించాడు. అప్పటికీ ఆయన వెనక్కు తగ్గకుండా అదేవిధంగా డీఎస్పీతోననూ మాట్లాడారు. దీంతో ఆ వృద్ఢుడ్ని అదుపులోకి తీసుకోని కారును స్వాధీనం చేసుకొని ఒన్‌టౌన్ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఆయన నగరంలో ఓ విద్యాసంస్థ నిర్వహించే జయరామయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై రాత్రి పొద్దుపోయేంత వరకు ఒన్‌టౌన్ పోలీసుస్టేన్‌లో పంచాయితీ నడిచింది.