దెబ్బతిన్న మిర్చి రైతులకు ఏలూరి చేయూత

ABN , First Publish Date - 2020-12-07T04:04:27+05:30 IST

తుఫాన్‌కు దెబ్బతిన్న మిర్చి రైతులకు చేయూత అందించేందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నడుంబిగించారు. భారీ వర్షాలకు ముంపునకు గురై పంటలు నష్టపోయిన వారికి బాసటగా నిలిచారు.

దెబ్బతిన్న మిర్చి రైతులకు ఏలూరి చేయూత
రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు


నర్సరీ యాజమాన్యాలతో మాట్లాడిన ఎమ్మెల్యే

తక్కువ ధరకు మొక్కలు అందేలా కృషి

నియోజకవర్గ పరిధిలో నారు అవసరమైతే 9866647618 ఫోన్‌ చేయాలని ఎమ్మెల్యే వినతి

పర్చూరు, డిసెంబరు 6 : తుఫాన్‌కు దెబ్బతిన్న మిర్చి రైతులకు చేయూత అందించేందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నడుంబిగించారు. భారీ వర్షాలకు ముంపునకు గురై పంటలు నష్టపోయిన వారికి బాసటగా నిలిచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటల పరిశీలనకు వెళ్లిన నారా లోకే్‌షకు ఎమ్మెల్యే ఏలూరి రైతుల పరిస్థితిని వివరించారు. మళ్లీ పంటలు వేసుకొనేందుకు సిద్ధమైన రైతులకు మిర్చి నారు ధర దిమ్మతిరిగేలా ఉంది. కొన్ని నర్సరీల్లో ఒక్కో మొక్క రూ.3 నుంచి రూ.6వరకు పలుకుతోందన్న విషయాన్ని రైతులు ఏలూరి దృష్టికి తీసుకుపోయారు. వారి ఆవేదనకు స్పందించిన ఏలూరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిర్చి నర్సరీల యాజమాన్యాలతో మాట్లాడి 25 లక్షల మొక్కలను ముందస్తుగా బుక్‌ చేసి తక్కువ ధరకు అందేలా చేశారు. వీటిలో ప్రధానంగా తేజ రకం, సెగ్మెంట్‌ 341 తోపాటు నెంబర్‌ 5కూడా రైతులకు అందుబాటులో లభించనుంది. ఒక్కో మొక్క రూ.1.20 పైసలకే అందనుంది. అలాగే మొక్కలను నేరుగా రైతు నివాసానికే చేర్చే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. రైతుకు కావలసిన మొక్కలు, గ్రామాల పేరు వివరాలను 9866647618 రైతు విభాగం నెంబర్‌లో సంప్రదించాలని ఎమ్మెల్యే చెప్పారు. 

Updated Date - 2020-12-07T04:04:27+05:30 IST