నీరు బయటకు పోయేదెప్పుడు..!
ABN , First Publish Date - 2020-12-01T05:54:16+05:30 IST
మండలంలోని లింగోజీపల్లి, సూరేపల్లి, తెల్లదిన్నె గ్రామాల్లో వందలాది ఎకరాల్లో శనగ, మిర్చి, వరిపంటలు నేటికీ మునకలో ఉన్నాయి.

కంభం, నవంబరు 30 : మండలంలోని లింగోజీపల్లి, సూరేపల్లి, తెల్లదిన్నె గ్రామాల్లో వందలాది ఎకరాల్లో శనగ, మిర్చి, వరిపంటలు నేటికీ మునకలో ఉన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం వ్యవసాయాధికారులు గానీ, ఉద్యానవన శాఖాదికారులు గాని ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రావూరి చిన్నవెంకటరాజుకు చెందిన 10ఎకరాల శనగ, 5 ఎకరాల మిర్చి, రావూరి వెంకటేశ్వర్లుకు చెందిన 3 ఎకరాల మిరప, 5 ఎకరాల శనగ, ఆవులపాటి కాశయ్యకు చెందిన 10ఎకరాల శనగ, రావూరి నారాయణకు 1 ఎకర శనగ, రావూరి హరిదాస్‌కు చెందిన 5 ఎకరాల శనగ, నలబోలు కోటయ్యకు చెందిన 4 ఎకరాల మిరప, 3 ఎకరాల శనగ, నలగోలు చిన్నకోటయ్యకు చెందిన 3ఎకరాల శనగ, 1 ఎకరా వరి, 2 ఎకరాల మిరప పంటలు పూర్తిగా నీటిలో మునిగి ఉన్నాయి. ప్రభుత్వ నష్టాన్ని లెక్కించి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.