పాదయాత్రలో పాల్గొన్న మంత్రి సురేష్‌

ABN , First Publish Date - 2020-11-14T02:55:55+05:30 IST

మండలంలోని జి.ఉమ్మడివరం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజలకోసం నాడు, ప్రజలతో నేడు పాదయాత్రలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు.

పాదయాత్రలో పాల్గొన్న మంత్రి సురేష్‌
ఉమ్మడివరంలో మాట్లాడుతున్న మంత్రి సురేష్‌


త్రిపురాంతకం, నవంబరు 13 : మండలంలోని జి.ఉమ్మడివరం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజలకోసం నాడు, ప్రజలతో నేడు పాదయాత్రలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం తీవ్ర ఇబ్బందులలో ఉందని కేంద్రం కూడా సహాయం చేయని పరిస్థితి నెలకొందని, అయినా సంక్షేమ ఫధకాలు అమలు చేస్తున్నామని అన్నారు. గతంలో టీడీపీ తప్పుడు వాగ్ధానాలతో గెలిచి ప్రజలను మోసం చేసిందని అన్నారు. కార్యక్రమం సందర్బంగా గుట్లపల్లికి చెందిన 30 కుటుంబాలు వైసీపీలో చేరాయి. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎ్‌సఆర్‌ జళకళ కార్యక్రమాన్ని మంత్రి పారంభించారు. ఈకార్యక్రమంలో తహసీల్దారు వి.కిరణ్‌, ఏపీవో మోషే, వైసీపీ నాయకులు ఆళ్ళ ఆంజనేయరెడ్డి, కోట్ల సుబ్బారెడ్డి, పి.చంద్రమౌళిరెడ్డి, ఆర్‌వి.పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-14T02:55:55+05:30 IST