బడుగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-26T05:36:27+05:30 IST

రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

బడుగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఎర్రగొండపాలెంలో నివేశస్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖామాత్యులు ఆదిమూలపు సురేష్‌, ప్రక్కన జేసి జె వి మురళి

పార్టీలకు అతీతంగా సంక్షేమపధకాలు అమలు, 

నివేశస్థలాల పట్టాలు పంపిణీ

రాష్ట్రవిద్యాశాఖామాత్యులు ఆదిమూలపు సురేష్‌

 ఎర్రగొండపాలెం, డిసెంబరు 25 : రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఎర్రగొండపాలెం  సమీపంలో మిల్లంపల్లి పంచాయతీలో శుక్రవారం పేదలకు నివేశస్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడారు. ఆర్డీవో ఎం.శేషిరెడ్డి సభకు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమంకోసం రూ.26,535 కోట్లు రూపాయలుతో 30.75 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్లు నిర్మించుకోవడానికి రెండు దఫాలుగా రూ.50,940 కోట్లుతో 28.30 లక్షలు పక్కాగృహాలు నిర్మించనున్నట్లు తెలిపారు.  రాష్ట్రంలో మొదటి దఫాలో 15.60 లక్షలు గృహాలు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 12,622 మంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తోందన్నారు. ఈనెల 25 నుంచి జనవరి 7వ తేదివరకు అన్ని గ్రామాల్లో  పట్టాల పంపిణీ పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తుందని అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రం సమీపంలోని మిల్లంపల్లి లో 49ఎకరాల ప్రభుత్వభూమిలో 1316 ప్లాట్లు  కేటాయించామని అన్నారు. ఈ ప్లాట్లు అభివృద్ధికి రూ.14.83 కోట్లతో అంతర్గత రోడ్లు, తాగునీరు సౌకర్యం కల్పించామని అని అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 94 లే-అవుట్స్‌ ఏర్పాటు చేశామని అన్నారు. నియోజకవర్గంలో రూ.20కోట్లతో 100 పడకల వైద్యశాల నిర్మించనున్నామని అన్నారు. దోర్నాల మండలం ఐనముక్కల గ్రామంలో 50కోట్లతో మల్టీ స్పెపాలిటీ వైద్యశాలకు శంకుస్థాపన చేశామని అన్నారు. సభకు ముందుగా రూ.1.80 లక్షలతో మోడల్‌ హౌస్‌కు శంకుస్థాపన చేశారు. 990 మందికి  మంత్రి ఆదిమూలపు సురేష్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేసీ జేవీ.మురళి, నియోజకవర్గం ప్రత్యేకాధికారి బి.చంద్రలీల, ఏఎంసీ చైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి, డీఎల్‌డీవో సాయికుమార్‌, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ వి వీరయ్య, హసింగ్‌ ఈఈ రాజేంద్రకుమార్‌, పీడీసీసీ డైరక్టరు ఎం బాలగురవయ్య, ఎర్రగొండపాలెం వైసీపీ కన్వీనరు డి కిరణ్‌గౌడ్‌, నవోదయపాఠశాల కమిటీ సభ్యుడు కందూరు గురుప్రసాదు, హౌసింగ్‌ ఇంజనీర్లు, వీఆర్వోలు, వైసీపీ ముఖ్యనాయకులు, నివేశస్థలాల లబ్దిదారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-26T05:36:27+05:30 IST