-
-
Home » Andhra Pradesh » Prakasam » Migrant laborers
-
బస్సుల్లో స్వగ్రామాలకు వలస కూలీలు
ABN , First Publish Date - 2020-05-13T10:54:25+05:30 IST
కరోనా నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లలేక ఇబ్బందిపడుతున్న వలస కూలీలను విద్యాశాఖమంత్రి ఆదిమూలపు

త్రిపురాంతకం, మే 12 : కరోనా నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లలేక ఇబ్బందిపడుతున్న వలస కూలీలను విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ చొరవతో మండల అధికారులు మంగళవారం తరలించారు. మండలంలో పనులకోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి 900మంది కూలీలు గత నవంబరులో వచ్చారు. అయితే ఈనెల 1, 2 తేదీలలో వాళ్ళందరూ తిరిగి వెళ్ళాల్సి ఉన్నా లాక్‌డౌన్ నేపథ్యంలో వెళ్ళలేకపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేష్ కలెక్టర్‌తో పాటు మార్కాపురం ఆర్డీవో, తూర్పుగోదావరి జిల్లా కలెక్టరుతో మాట్లాడి సాంకేతిక సమస్యలను పరిష్కరించారు. ఎట్టకేలకు మంగళవారం ఉదయానికి అనుమతులు రావడంతో వైద్యశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించిన అనంతరం కూలీలను మార్కాపురం డిపో నుంచి వచ్చిన 40బస్సుల్లో తూర్పుగోదావరికి తరలించారు. తహసీల్దారు జి.జయపాల్, ఎస్సై యూవీ.కృష్ణయ్య, ఎంపీడీవో సుదర్శనం తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు.