వెల్‌నెస్‌ కేంద్రాల్లో వైద్య సేవలందించాలి

ABN , First Publish Date - 2020-09-17T11:44:01+05:30 IST

వెల్‌నెస్‌ కేంద్రాల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్యసేవలందించాలని ఢిల్లీ కేంద్ర బృందం (వరల్డ్‌ బ్యాంక్‌) సభ్యుడు శ్యామంత్‌ బేజాయ్‌ నియోగ్‌ సూచించారు. నడకుదురులోని వెల్‌నెస్‌ సెంటర్‌ను ఎన్‌ఆర్‌హెచ్‌ఎం బృందంతో కలిసి ఆయన సందర్శించారు.

వెల్‌నెస్‌ కేంద్రాల్లో వైద్య సేవలందించాలి

కరప, సెప్టెంబరు 16: వెల్‌నెస్‌ కేంద్రాల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్యసేవలందించాలని ఢిల్లీ కేంద్ర బృందం (వరల్డ్‌ బ్యాంక్‌) సభ్యుడు శ్యామంత్‌ బేజాయ్‌ నియోగ్‌ సూచించారు. నడకుదురులోని వెల్‌నెస్‌ సెంటర్‌ను ఎన్‌ఆర్‌హెచ్‌ఎం బృందంతో కలిసి ఆయన సందర్శించారు. రికార్డులు, వసతులను పరిశీలించారు. వైఎస్సార్‌ కంటివెలుగు, ఇమ్యునైజేషన్‌, మాతాశిశు సంరక్షణ, లెప్రసీ, డెంగ్యూ, కేన్సర్‌, ఊబకాయం వంటి వ్యాధులకు చేపడుతున్న వైద్యసేవలను తెలుసుకున్నారు. మండల వైద్యాధికారి శ్రీనివాసనాయక్‌, వెల్‌నెస్‌ సెంటర్‌ డీసీ, డీఐవో డాక్టర్‌ అరుణాదేవి, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం సభ్యుడు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-17T11:44:01+05:30 IST