ఢిల్లీ వెళ్లొచ్చిన వారికి వైద్య పరీక్షలు పూర్తి
ABN , First Publish Date - 2020-04-08T11:23:19+05:30 IST
ఢిల్లీ నుంచి జిల్లాకు తిరిగి వచ్చిన వారికి వైద్య పరీక్షలు పూర్తి స్థాయిలో ముగిశాయని కలెక్టర్ పోలా భాస్కర్ వె

కలెక్టర్ పోలా భాస్కర్
ఒంగోలు(కలెక్టరేట్), ఏప్రిల్ 7 : ఢిల్లీ నుంచి జిల్లాకు తిరిగి వచ్చిన వారికి వైద్య పరీక్షలు పూర్తి స్థాయిలో ముగిశాయని కలెక్టర్ పోలా భాస్కర్ వె ల్లడించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ కరోనా వైరస్ సోకిన కేసుల సంఖ్య జిల్లాలో స్థిరంగా ఉందన్నారు. 24 మంది కరోనా వ్యాధికి గురయ్యారని, అందులో విదేశాల నుంచి తిరిగి వచ్చిన యువకుడి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందని చెప్పారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న నమూనాలన్నీ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వా రితో సన్నిహితంగా మెలిగిన వారేనని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణపై జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్దంగా ముందుకు పోతుందన్నారు.
లా క్‌డౌన్ పటిష్టంగా అమలు చేయడం ద్వారానే వైర స్ అదుపులో ఉందని ఆయన తెలిపారు. జిల్లాలో నమోదైన కేసులన్నీ అధికంగా పట్టణ ప్రాంతాలకు చెందినట్లు గుర్తించామన్నారు. మండల, నియోజక వర్గ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి గ్రామాల్లో నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్ హెచ్‌వో, వైద్యాధికారి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు సమన్వయంతో సర్వేలైన్స్ నిర్వహిస్తున్నామని ఆ యన వివరించారు. కరోనా వైరస్ లక్షణాలు కని పిస్తే అనుమానాస్పద కేసులుగా భావించి తక్షణ మే వారిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశా మన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో హైరిస్క్ కేటగిరిలో ఉన్న వ్యక్తులను మూడవ విడత సర్వే లో గుర్తించామని, అలాటి వారిని సర్వేలైన్స్‌లో ఉం చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ భాస్కర్ వెల్లడించారు.