కారుతో యువకుడిని ఢీకొట్టి.. చనిపోలేదని మళ్లీ వెనక్కు వచ్చి మరీ..

ABN , First Publish Date - 2020-05-09T20:45:35+05:30 IST

అది కందులాపురం నడిసెంటర్‌.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిర్మానుష్యంగా ఉంది.. బైక్‌పై వెళుతున్న ఓ యువకుడ్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.. అతను కిందపడిపోయాడు.. కారు వేగంగా ముందుకెళ్లింది.. ద్విచక్రవాహనదారుడు లేచి కుంటుకుంటూ వెళ్తుండగా కారు మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి మరింత బలంగా ఢీకొట్టింది.

కారుతో యువకుడిని ఢీకొట్టి.. చనిపోలేదని మళ్లీ వెనక్కు వచ్చి మరీ..

కారుతో పలుమార్లు ఢీకొట్టి హత్య.. 

చనిపోయాడని నిర్ధారించుకున్నాకే స్టేషన్‌లో లొంగుబాటు

హతుడు, హంతకుడు ఇద్దరూ పెద్దనాన్న, 

చిన్నాన్న పిల్లలే

ఘటనకు యువతిపై వేధింపులే కారణమా ?


కంభం(ప్రకాశం జిల్లా): అది కందులాపురం నడిసెంటర్‌.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిర్మానుష్యంగా ఉంది.. బైక్‌పై వెళుతున్న ఓ యువకుడ్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.. అతను కిందపడిపోయాడు.. కారు వేగంగా ముందుకెళ్లింది.. ద్విచక్రవాహనదారుడు లేచి కుంటుకుంటూ వెళ్తుండగా కారు మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి మరింత బలంగా ఢీకొట్టింది.. యువకుడు మరణించాడని నిర్ధారించుకుని పోలీసుస్టేషన్‌లో కారుతో సహా లొంగిపోయాడు ఓ వ్యక్తి... ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి, హత్య చేసిన వ్యక్తి ఇరువురూ పెద్దనాన్న, చిన్నాన్న పిల్లలే. ఇద్దరూ విజయవాడలో ఉంటూ కరోనా నేపథ్యంలో స్వగ్రామాలకు వచ్చారు. కారుతో ఢీకొట్టిన వ్యక్తి జెట్టి వెంకటకరుణాకర్‌ మండలంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన వ్యక్తికాగా, మృతుడి జెట్టి కాశీవిశ్వేశ్వరరావు మండలంలోని పోరుమామిళ్లపల్లి. మృతుడు విజయవాడలో ముత్తూట్‌ ఫైనాన్స్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది.


అసలు విషయం ఏంటంటే...

విజయవాడలో ఉంటున్న వెంకటకరుణాకర్‌ మేనకోడలను జెట్టి కాశీవిశ్వేశ్వరరావు తరచూ వెంటపడి వేధించేవాడని, ఈ విషయంలో కాశీవిశ్వేశ్వరరావును కరుణాకర్‌ పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. దీనిపై గతంలో కూడా పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా శుక్రవారం మద్యం షాపులు తెరవడంతో ఇరువురు ఎవరికివారు తమ స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నారు. ఇదే సమయంలో కాశీవిశ్వేశ్వరరావుకు కరుణాకర్‌ ఫోన్‌ చేసి మందలించాడు. ఇరువురు మధ్య మాటామాట పెరిగి అంతుచూస్తామని ఎవరికి వారే బెదిరించుకున్నారు. ఆ తర్వాత కాశీవిశ్వేశ్వరరావు కంభం వైపు ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్లినట్లు తెలిసింది. అప్పటికే కారులో ఉన్న కరుణాకర్‌ సమయం కోసం వేచిచూస్తున్నాడు.కాశీవిశ్వేశ్వరరావు బైక్‌ వస్తుండగా గమనించి ఢీకొట్టాడు. అయినప్పటికీ అతను పైకిలేచినడవడంతో మళ్లీ వెనక్కి వచ్చి బలంగా ఢీకొట్టి హ త్య చేసినట్లు సమాచారం. ఆ తర్వాత నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విషయం తె లుసుకున్న డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, మార్కాపురం సీఐ, ఎస్‌ఐ మాధవరావు సంఘటన స్థలానికి వచ్చి హత్యా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-09T20:45:35+05:30 IST