భారీగా తెలంగాణ మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-12-20T06:56:16+05:30 IST
నిమ్మకాయల వ్యాపారం మాటున తెలం గాణ నుంచి పెద్దఎత్తున మద్యం తరలిస్తుండగా ఎస్‌ఈబీ అధికారులు సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం వద్ద పట్టుకున్నారు.

నిమ్మకాయల మాటున మార్టూరుకు రవాణా
గతంలోనూ..ఇప్పుడూ తాటివారిపాలెం,
కోలలపూడికి చెందిన వ్యక్తులే నిందితులు
అద్దంకి, డిసెంబరు 19 : నిమ్మకాయల వ్యాపారం మాటున తెలం గాణ నుంచి పెద్దఎత్తున మద్యం తరలిస్తుండగా ఎస్‌ఈబీ అధికారులు సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం వద్ద పట్టుకున్నారు. శనివారం అద్దంకిలోని ఎస్‌ఈబీ సర్కిల్ కార్యాలయం వద్ద ఆశాఖ అసి స్టెంట్ కమిషనర్ శ్రీనివాసచౌదరి, ఎస్‌ఈబీ సూపరింటెండెంట్ అరు ణకుమారి వివరాలు వెల్లడించారు. మార్టూరు మండలం తాటివారి పాలెంకు చెందిన పల్లపు నాగేశ్వరరావు, కోలలపూడికి చెందిన వి.శ్రీని వాసరావు తెలంగాణలో 40 పెట్టెల (1,920 బాటిళ్ల) మద్యం కొనుగోలు చేశారు. దాన్ని వాహనంలో వేసుకొని బయల్దేరారు. శనివారం వేకువ జామున 4గంటల సమయంలో సంతమాగులూరు మండలం పుట్టా వారిపాలెం వద్ద అధికారుల తనిఖీల సందర్భంగా మద్యం బాటిళ్లు ప ట్టుబడ్డాయి. వీటి ధర తెలంగాణలో రూ.2.15లక్షలు కాగా ఆంధ్రలో రూ.3.10లక్షలు ఉంటుందన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం రోజున మరింత ఎక్కువ ధరకు అమ్మకాలు చేసేందుకు పెద్దఎత్తున తరలి స్తున్నట్లు తమ విచారణలో వెల్లడైనట్లు సూపరింటెండెంట్ అరుణ కుమారి తెలిపారు. సీసాలు స్వాధీనం చేసుకొని, ఆ వాహనాన్ని సీజ్ చేశామన్నారు. పల్లపు నాగేశ్వరరావు, వల్లెపు శ్రీనివాసరావును అరెస్టు చేసినట్లు తెలిపారు. మద్యాన్ని పట్టుకున్న అద్దంకి ఎస్‌ఈబీ సీఐ శ్రీని వాసులు, ఎస్‌ఐ ఆంజనేయులు, సిబ్బందిని అసిస్టెంట్ కమిషనర్ శ్రీని వాస్‌చౌదరి, సూపరింటెండెంట్ అరుణకుమారి అభినందించారు.