-
-
Home » Andhra Pradesh » Prakasam » Letest caltivetion
-
సాంకేతిక పద్ధతులలో పంటలు సాగు చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-11-25T05:40:54+05:30 IST
ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో రైతులు పంటలను సాగు చేసుకొని తక్కువ పెట్టుబడులతో నాణ్యమైన అ ధిక దిగుబడులు సాధించాలని గుంటూరు లాంఫాం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.రత్నప్రసాద్ సూచించారు.

దర్శి, నవంబరు 24 : ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో రైతులు పంటలను సాగు చేసుకొని తక్కువ పెట్టుబడులతో నాణ్యమైన అ ధిక దిగుబడులు సాధించాలని గుంటూరు లాంఫాం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.రత్నప్రసాద్ సూచించారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. తెగుళ్లను, క్రిమికీటకాలను తట్టుకునే మేలు రకమైన వంగడాల రూపకల్పనకు శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాలైన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. వ్యవసాయ డిగ్రీ తీసుకుంటున్న విద్యార్థులు రైతులకు మెరుగైన సేవలందించి అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞానకేంద్రం పోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ దు ర్గాప్రసాద్, ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్ వరప్రసాదరావు, మార్కాపు రం వ్యవసాయ కళాశా ల ప్రిన్స్‌పల్ డాక్టర్ మ ల్లికార్జునరెడ్డి, శాస్త్రవేత్తలు డాక్టర్ జి.రమేష్, డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి, రైతులు కళాశాల విద్యార్ధులు పాల్గొన్నారు.