-
-
Home » Andhra Pradesh » Prakasam » lequer sezed
-
మద్యంతో పట్టుబడ్డ లారీ
ABN , First Publish Date - 2020-12-19T05:50:41+05:30 IST
తెలంగాణ రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ సూపరింటెండెంట్ ఆవులయ్య చెప్పారు.

మార్కాపురం(వన్‌టౌన్), డిసెంబరు 18 : తెలంగాణ రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ సూపరింటెండెంట్ ఆవులయ్య చెప్పారు. శుక్రవారమిక్కడ ఆయన మాట్లాడారు. పట్టణంలో పార్శిల్ లారీలో అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యాన్ని రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు సోదాలు నిర్వహించామన్నారు. లారీలో 18 ఫుల్ బాటిళ్లు దొరికాయని, వాటిని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ తనిఖీలలో మార్కాపురం ఎస్‌ఈబీ స్టేషన్ ఎస్‌ఐ టి.ప్రభుదాస్, హెడ్‌కానిస్టేబుల్ యూసఫ్, రంగనాయకులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారని తెలిపారు.