నెక్ట్స్‌ ఏంటి?

ABN , First Publish Date - 2020-05-17T10:21:31+05:30 IST

కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ మూడో దశ ఆది వారంతో ముగియనుంది.

నెక్ట్స్‌ ఏంటి?

నేటితో ముగియనున్న మూడో దశ లాక్‌డౌన్‌

తాజా నిర్ణయం కోసం ఎదురుచూపు


ఒంగోలు, మే 16 (ఆంధ్రజ్యోతి) : కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ మూడో దశ ఆది వారంతో ముగియనుంది. దీంతో తదుపరి ప్రభుత్వం తీసుకోనున్న చర్యల కోసం జిల్లా ప్రజానీకం ఎదురు చూస్తోంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోల్చు కుంటే ఇక్కడ కరోనా వ్యాప్తి ఒకింత అదుపులోనే ఉంది. కొద్ది ప్రాంతాల్లో ఆ ప్రభావం ఉండగా లాక్‌ డౌన్‌ నిబంధనలతో జిల్లా ప్రజలంతా ఆవస్థలు పడు తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 11 మండలాల్లో 15 కంటైన్మెంట్‌ క్లస్టర్లు ఉండగా మిగతావన్నీ కరోనా ప్ర భావం లేని ప్రాంతాలుగా ఉన్నాయి.


కేంద్ర మార్గ దర్శకాల ప్రకారం చూస్తే కంటైన్మెంట్‌ క్లస్టర్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. కాగా ఈనెల 4నుంచి అమలు లో ఉన్న మూడోదశ లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగి యనుండగా ఈ దశలో ప్రభుత్వాలు ఇచ్చిన సడలిం పులు కూడా జిల్లాలో అమలుకావడం లేదు. పాక్షికం గానే సడలింపులు ఇస్తుండటంతో అన్ని వర్గాల ప్రజ లు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 18నుంచి ప్రభుత్వాలు అమలుచేయనున్న వి ధానంపై అందరిలోనూ చర్చ సాగుతోంది. లాక్‌డౌన్‌ కొనసాగింపు అనివార్యమన్న విషయమై ఇప్పటికే స్ప ష్టత రాగా గతం కన్నా మెరుగ్గా సడలింపులు ఉం టా యని తెలుస్తోంది. దీనిపై స్పష్టత కోసం జిల్లా ప్రజ లు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా 53వ రోజై న శనివారం కూడా లాక్‌డౌన్‌ కొనసాగింది. 

Updated Date - 2020-05-17T10:21:31+05:30 IST