పోర్టు ఏర్పాటుకు భూములు అనుకూలం

ABN , First Publish Date - 2020-04-24T10:55:25+05:30 IST

రామాయపట్నంలో పోర్టు ఏర్పాటుకు అన్ని విధాలా భూములు అనుకూలంగా ఉన్నాయని రాష్ట్ర

పోర్టు ఏర్పాటుకు భూములు అనుకూలం

కందుకూరు, ఉలవపాడు, ఏప్రిల్‌ 23 : రామాయపట్నంలో పోర్టు  ఏర్పాటుకు అన్ని విధాలా  భూములు అనుకూలంగా ఉన్నాయని రాష్ట్ర మౌలిక సదుపాయాలు, అభివృద్ధి శాఖ స్పెషల్‌  చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ చెప్పారు. గురువారం రామాయపట్నం పోర్టు ప్రతిపాదిత కరేడు తీర ప్రాంతంలోని భూములను ఆయన పరిశీలించారు. ఆయా భూముల వివరాలను కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. 


కరేడు గెస్ట్‌హౌస్‌ పరిసర ప్రాంతంలోని భూములన్నీ ప్రయివేటు భూములని, ప్రభుత్వ భూమి లేదని మండల మ్యాప్‌ ద్వారా సర్వేయర్లు వివరించారు. అలాగే గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరులోని ప్రభుత్వ భూముల వివరాలను అధికారులు మ్యాప్‌ ద్వారా తెలిపారు. ఆయన వెంట మ్యాన్‌టోరియం బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి, బోర్డు జీఎం రాజగోపాల్‌, ఏపీఐసీసీ  జోనల్‌ మేనేజర్‌ నరసింహారావు, కందుకూరు ఆర్డీవో ఓబులేష్‌, ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ అధికారిణి కృష్ణవేణి, కందుకూరు ఆర్డీవో ఓబులేసు, తహసీల్దార్‌లు మరియమ్మ, శిల్ప, సర్వేయరు శ్రీనివాసరావు, వీఆర్వోలు తదితరులు ఉన్నారు.  

Updated Date - 2020-04-24T10:55:25+05:30 IST