56 సెంట్ల ప్రభుత్వ భూమి గుర్తింపు

ABN , First Publish Date - 2020-11-26T05:33:27+05:30 IST

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని త హసీల్దార్‌ ప్రభాకరరావు అన్నారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన భూ బకాసురులు కథనానికి తహసీల్దార్‌ ప్రభాకరరావు స్పందించారు.

56  సెంట్ల ప్రభుత్వ భూమి గుర్తింపు
ఆక్రమణ స్థలాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌ ప్రభాకరరావు

భూబకాసురుల కథనానికి స్పందన

అద్దంకి, నవంబరు 25 : ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే  చర్యలు తప్పవని త హసీల్దార్‌ ప్రభాకరరావు అన్నారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన భూ బకాసురులు కథనానికి తహసీల్దార్‌ ప్రభాకరరావు స్పందించారు. తన సిబ్బందితో కలిసి ఆక్రమిత స్థలాలను పరిశీలించారు. ఉత్తర అద్దంకి రెవెన్యూ పరిఽధిలో 208 సర్వే నెంబర్‌లో  నామ్‌ రోడ్డు  వెంబడి  56 సెంట్ల ప్రభుత్వ భూమి ఉన్నట్లు ఆయన గుర్తించారు. ఆక్రమించి చదును చేసినట్లు  గుర్తించి తక్షణమే ఆ భూమి వద్ద  హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని నగర పంచాయతీ అధికారులకు తెలియజేశారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం సెంట్‌ ధర రూ.4 లక్షల వరకు ఉండటటంతో మొత్తం  ధర రూ.2 కోట్ల పైమాటే.  నామ్‌ రోడ్డు వెంబడే ఉండటం, పట్టణానికి అత్యంత సమీపంలో ఉండటంతో ప్రభుత్వ కార్యాల యాలకు ఉపయోగపడుతుందని  పలువురు అభి ప్రాయపడుతున్నారు.  ఏఎ్‌సవో అమరనాథ్‌, సర్వేయర్‌ పరిశుద్ధరావు, వీఆర్వో సురేంద్ర పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-26T05:33:27+05:30 IST